Sunday, April 28, 2024

న్యాయవాదుల హత్యకేసులో నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

lawyer couple's murder in Telangana

హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యకేసులో
ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న
పోలీసులు ప్రధాన నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల
చిరంజీవి, అక్కపాక కుమార్‌ల అరెస్టు గంజపడుగులోని
భూ వివాదాలే హత్యలకు కారణం : ఐజి నాగిరెడ్డి

మన తెలంగాణ/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గం రామగిరి మండలం కల్వచర్ల శివారులో ప్ర ధాన రహదారిపై బుధవారం హైకోర్టు న్యా యవాద దంపతుల దారుణ హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు నార్త్ జోన్ ఐజి నాగిరెడ్డి తెలిపారు. పెద్దపల్లి పోలీస్‌స్టేషన్ ఆవరణలో గురువారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ, మృతుడు గట్టు వామన్‌రావు ఆయన భార్య పివి నాగమణి బుధవా రం హైద్రాబాద్ నుండి మంథనిలోని కోర్టుకు ఒక పనిపై హాజరయ్యారు. వారు డ్రైవర్ సతీష్‌తో క్రెటా కారు నంబర్ టిఎస్ 10 ఇజె 28 28లో వచ్చి తిరిగి హైద్రాబాద్ వెళ్తున్న క్రమ ంలో మధ్యాహ్నం రామగిరి పోలీస్ స్టేషన్ పరిధి కల్వచర్ల వద్ద న్యాయవాదులు గట్టు వామన్‌రావు అతని భార్య గట్టు నాగమణిలు ప్రయాణిస్తున్న కారును ఆపి గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారని కారు డ్రైవర్ సతీష్ వామన్‌రావు తండ్రి కిషన్‌రావుకు సమాచారం అందించారని ఐజి నాగిరెడ్డి తెలిపారు. సమాచారం అందుకున్న రామగిరి ఎస్‌ఐ ఘటన స్థలానికి చేరుకోగా గాయపడి రక్తపు మడుగులో వామన్‌రావు పడి ఉన్నారని, వామన్‌రావు కారులో అతని భార్య నాగమణి తీవ్ర గాయాలతో ఉండడాన్ని చూసి 108 అంబులెన్స్ సహాయంతో పెద్దపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారని తెలిపారు. ఈ ఘటనపై రామగుండం సిపి సత్యనారాయణ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు ఐజి పేర్కొన్నారు.

హత్యకు గల కారణాలు

మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని రామాలయ కమిటీకి సంబంధించి వెల్ది వసంతరావు, గట్టు విజయ్‌కుమార్‌పై హైకోర్టులో రిట్ పిటిషన్ ధాఖలు చేయడానికి ఫిర్యాధిదారుడి కుమారుడు వామన్‌రావు అతని తండ్రి, అతని చిన్న తమ్ముడు ఇంద్రశేఖర్‌రావు సంతకాన్ని తీసుకొని, తిరిగి హైద్రాబాద్ వెళ్తుండగా కల్వచర్ల శివారులోని పెట్రోల్ పంపు వద్ద నిందితులు కారుకు అడ్డు తిరిగి గట్టు వామన్‌రావు, నాగమణిలను వేటా కోడవలితో దాడులు జరిపినట్లు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో వామన్‌రావు తండ్రి కిషన్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంథని మండలం గుంజపడుగు గ్రామంలో శ్రీరామస్వామి, గోపాలస్వామి దేవస్థానాల కోసం కుంట శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు అక్కపాక కుమార్, వెల్ది వసంతరావు ఒక కొత్తకమిటీని ఏర్పాటు చేశారని, ఆలయ కార్యదర్శి ఇంద్రశేఖర్‌రావును పిలిచి సమావేశం నిర్వహించారని ఫిర్యాది తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ అనుమతి లేకుండా వారు గ్రామంలో దండోర వేయించారని, గుంజపడుగు గ్రామానికి చెందిన సర్పంచ్, వామన్‌రావు అతని భార్య నాగమణి నుండి కుంట శ్రీను నిర్మిస్తున్న పెద్దామ్మ ఆలయం, ఇల్లు అక్రమంగా నిర్మాణం గురించి సలహా ఇచ్చినందుకు దాన్ని మనస్సులో పెట్టుకున్న కుంట శ్రీనివాస్, వెల్ది వసంత్‌రావు, అక్కపాక కుమార్‌లు తన కుమారుణ్ణి, కోడల్ని చంపారని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదారుడు కిషన్‌రావు పిటిషన్ ఇవ్వడం జరిగిందని పోలీసులు తెలిపారు.

మహారాష్ట్ర సరిహద్దుల్లో నిందితుల ఆరెస్టు

సిపి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేస్తుండగా నిందితులు తెలంగాణ మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాంకిడి చంద్రపూర్ ప్రాంతాల్లో ఉన్నారని పక్కా సమాచారం అందడంతో అక్కడి టాస్క్‌ఫోర్స్ పోలీసుల ద్వారా తనిఖీలు నిర్వహించగా గురువారం కుంట శ్రీనివాస్, మరో వ్యక్తి కలిసి తన బ్రీజా కారులో వెళుతుండగా పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు. అనంతరం గోదావరిఖణి ఏసీపీ ముందు పరచుగా విచారణ చే యగా మంథని మండలం గుంజపడుగుకు చెందిన కుం ట శ్రీనివాస్, విలోచవరంకు చెందిన శివందుల చిరంజీవిగా పోలీసులకు చెప్పారు. అదే విధంగా మరో నిందితు డు గుంజపడుగుకు చెందిన అక్కపాక కుమార్‌ను మంథ ని ప్రాంతంలోకి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

న్యాయవాదులపై దాడి క్రమం

వామన్‌రావు కోర్టుకు వచ్చిన తిరిగి హైద్రాబాద్ వెళ్తుండగా హత్య చేయడానికి పథకం పన్నిన కుంట శ్రీను, ఇంకోక వ్యక్తి చిరంజీవిని తీసుకొని శ్రీను తన కారుని అక్కపాక కుమార్‌కి ఇచ్చి వామన్‌రావు కదలికలను తెలియజేయాలని కుంట శ్రీను తెలుపగా అక్కపాక కుమార్ కారును తీసుకొన్నాడు. కుంట శ్రీనుకు మంథనికి చెంది న బిట్టు శ్రీను తన కారును, రెండు కొబ్బరి బొండాలు కొట్టే కత్తులను తీసుకొచ్చి ఇచ్చాడు. బిట్టు శ్రీను నుండి కుంట శ్రీను కారు తీసుకోగా ఆ కారును చిరంజీవి డ్రైవింగ్ చేస్తూ ఉంటే కుంట శ్రీను పక్కన కూర్చుని మంథని చౌరస్తాకి వచ్చారు. అదే సమయంలో వామన్‌రావు తన భార్య నాగమణితో కలిసి టిఎస్ 10 ఇజె 2828లో మంథని నుంచి బయలు దేరి పెద్దపల్లి వైపు వెళ్లే సమాచారం ముందుగానే తెలుసుకున్న కుంట శ్రీను, చిరంజీవి రామగిరి పోలీస్‌స్టేషన్ పరిధి కల్వచర్ల శివారులో రోడ్డు మరమ్మత్తులు జరుగుతున్న ప్రాంతంలో కారు ఖచ్చితంగా నెమ్మదిగా వస్తుందని ముందుగానే నిందితులు వామన్‌రావు కారు రాక కోసం రోడ్డు ప్రక్కన ఆపి రెక్కి నిర్వహించారు. వామన్‌రావు కారు ముందుకు రాగానే దానికి టక్కర ఇచ్చి కారు ఆపి కుంట శ్రీను కత్తి తీసుకుని వెళ్లి కారు ముందుకి వెళ్లి అద్దంపై కొట్టగా డ్రైవర్ భయపడి కారు ఆపి దిగి పారిపోయాడు. వామన్‌రావు డ్రైవర్ సీట్లోకి వచ్చి కారుని నడపడానికి ప్రయత్నం చేయగా కుంట శ్రీను వామన్‌రావుని కారులో నుంచి బయటకు గుంజి కత్తులతో దాడి చేశాడు. అదే సమయంలో చిరంజీవి రెండో పక్క నుండి వచ్చి వామన్‌రావు భార్య నాగమణిపై కత్తితో దాడి చేసి తిరిగి వామన్‌రావుపై కూడా దాడి చేశాడు. ఘటన స్థలంలో కొంత మంది వ్యక్తులు తీసిన వీడియో ఆధారంగా నిందితులను పట్టుకొని ఆరెస్టు చేసినట్లు తెలిపారు.

నేడు నిందితులను కోర్టుకు హాజరుపరుస్తాం

ప్రధాన నిందితులు ఏ1 కుంట శ్రీనివాస్, ఏ2 శివందుల చిరంజీవి, ఏ3 అక్కపాక కుమార్‌లను కోర్టుకు హజరుపరచనున్నట్లు ఐజి తెలిపారు. నిందితులకు సహకరించిన బిట్టు శ్రీను పరారీలో ఉన్నారని త్వరలోనే అదుపులోకి తీసుకొని విచారణ చేస్తామని ఐజి పేర్కొన్నారు. అలాగే దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, నిందితులను కస్టడికి తీసుకొని సాంకేతిక సాక్షాలు, డిజిటల్ అండ్ సోషల్ మీడియా సాక్షాలు, ఇతర సాక్షాల ద్వారా దర్యాప్తు చేస్తామని, ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఎవరి ప్రయేయం ఉన్నా, ఎవరినైనా ఎంతటి వారినైనా వదలమని ఐజి నాగిరెడ్డి వెల్లడించారు.

24 గంటల్లో నిందితులను పట్టుకున్న
పోలీసులకు ఐజి అభినందనలు

రామగుండం సిపి సత్యనారాయణ ఆదేశాల మేరకు నిందితులను పట్టుకున్న సీఐలు మహేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్, టాస్క్‌ఫోర్స్ సీఐ రాజ్‌కుమార్, ఐటికోర్ టీం సీఐ నరేష్‌కుమార్, రామగుండం సిఐపి కరుణాకర్‌ఱావు, సుల్తానాబాద్ సిఐపి ఇంద్రసేనారెడ్డిలతో పాటు రామగుండం సిపి సత్యనారాయణతో పాటు ఐజి నాగిరెడ్డి అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News