హైదరాబాద్: మెదక్ ఎంపి రఘునందన్ రావుకు (Raghunandan Rao) మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. దుండగులు ఆయనకు ఫోన్ చేసి బెదిరించారు. హైదరాబాద్‌లోనే ఉన్నామని.. సాయంత్రంలోగా చంపేస్తామని అన్నారు. రఘునందన్ రావుకు ఇలా బెదిరింపు కాల్ రావడం ఇది ఆరోసారి. తాజాగా 9404348431 అనే నెంబర్ నుంచి కాల్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మొదటిసారి రఘునందన్ రావుకు (Raghunandan Rao) జూన్ 23న బెదిరింపు కాల్ వచ్చింది. మావోయిస్టుల పేరుతో ఆయన్ను సాయంత్రంలోగా చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో ఆయనకు భద్రతను పెంచారు. ఆ తర్వాత పలు మార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రతీసారి కూడా ఆయనకు కాల్ చేసి ఇదే విధంగా దుండగులు బెదిరిస్తున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ ఆపాలని లేకుండా చంపేస్తామని.. దమ్ముంటే కాపాడుకోవాలని దుండగులు హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.