Saturday, May 4, 2024

ముంబయిలో లిఫ్ట్ కూలి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయిలోని 25 అంతస్తుల భవనంలో లిఫ్ట్‌కూలిపోవడంతో 20ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ముంబయి సబర్బన్ విక్రోలీలో బుధవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈశాన్య ముంబయిలోని స్టేషన్‌రోడ్డులో ఉన్న సిద్ధివినాయక సొసైటీలో ప్రమాదం జరిగిన సమయంలో అద్దాల క్యాబిన్‌తో ఉన్న లిఫ్ట్‌లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. లిఫ్ట్ గ్రౌండ్‌ఫ్లోర్‌కు పడిపోయిన తర్వాత వారంతా చిక్కుకుపోయారు.

అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకుని లిఫ్ట్ తలుపులు తెరవగా నలుగురిలో ముగ్గురు మాత్రం తమకు తాము బయటకు రాగలిగారు. అయితే తీవ్రంగా గాయపడిన ఓ యువకుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాధితుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News