Sunday, December 4, 2022

దమ్మపేటలో లైన్‌మెన్ దుర్మరణం

- Advertisement -

Lineman died by electric shock in Dammapeta

దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కలగండిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఓ లైన్‌మెన్ దుర్మరణం పాలయ్యాడు. స్తంభం ఎక్కి పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడిని అప్పారావు(35)గా గుర్తించారు. అనంతరం ఘటనాస్థలిని పరిశీలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Related Articles

- Advertisement -

Latest Articles