Sunday, May 5, 2024

బిఆర్‌ఎస్‌లో చేరిన లింగగిరి సర్పంచ్ భాస్కర్

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతో మంది గులాబీ దళంలో చేరడం రివాజుగా మారిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని లింగగిరి గ్రామ సర్పంచ్ మాదారపు భాస్కర్, అతని అనుచరులు కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కెసిఆర్ ప్రభుత్వం అమలు చేసిన ఏ పథకమైన పేదరికమే ప్రమాణంగా చేసుకొని రాజకీయాలకతీతంగా రూపొందించనవే అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ నియమాలకు కట్టుబడి, విధేయతతో, నమ్మకంతో పార్టీకి, ప్రజలకు సేవ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని సిఎం కెసిఆర్ భావిస్తున్నారన్నారు.

అందరూ సమైక్యంగా ఉంటే గ్రామాభివృద్ధి బాగా చేయొచ్చని, నేను వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యకర్తలు పార్టీకి వెన్నెముక లాంటి వారని నమ్మి బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. బిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో సర్పంచ్ మాదారపు భాస్కర్‌తో పాటు కుమారస్వామి, కేశవులు, సతీష్, సాయి ఉన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పరకాల లక్ష్మి రాజన్న, మాజీ ఎంపీపీ జక్క అశోక్, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, జడ్పీ కోఆప్షన్ ఎండీ రఫీ, సర్పంచులు శ్రీధర్‌రెడ్డి, కుమారస్వామి, ఉప సర్పంచ్ రాజశేఖర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, కుమారస్వామి, వెంకన్న, అశోక్, ప్రవీణ్, శ్రీను, పెద్ద సూరయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News