Tuesday, April 30, 2024

రుణాలు మరింత ప్రియం….

- Advertisement -
- Advertisement -

25 బేసిస్ పాయింట్లు పెంచిన హెచ్‌డిఎఫ్‌సి
ఇదే బాటలో ఇతర బ్యాంకులు
ఆర్‌బిఐ రెపో రేటును పెంచడమే కారణం

House-related expenses, be it loan EMIs

 

న్యూఢిల్లీ : ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) రెపో రేటు పెంపుతో బ్యాంకు రుణాలు మరింత ప్రియం అవుతున్నాయి. మోర్టగేజ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ సోమవారం రుణ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించిం ది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందు కు రిజర్వు బ్యాంక్ 0.50 శాతం రెపో రేటును పెంచింది. దీంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా దీనిని బదిలీ చేసేందుకు సిద్ధమవుతున్నా యి. అంటే వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ఇకపై గృహ, వాహన రుణాలు భారం కానున్నాయి.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
మోర్టగేజ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ రుణ రే ట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నిర్ణయంతో ప్రస్తుత, కొత్త రుణగ్రస్తులు ఇద్దరికీ లో న్లు మరింత ప్రియం కానున్నాయి. ఈ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు పెంపు ఆగస్టు 1 నుంచి అ మల్లోకి వచ్చింది. మూడు నెలల్లో హెచ్‌డిఎఫ్‌సి ఆరుసార్లు వడ్డీ రేట్లను పెంచింది. మే నెల నుంచి రేటు 140 బేసిస్ పాయింట్లు పెరిగింది.
ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)
దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఎంసిఎల్‌ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు) 0.10 శాతం పెంచగా, ఇది జూలై 15 నుంచి అమల్లోకి వచ్చింది. అదే సమయంలో ఎస్‌బిఐ ఆగస్టులో ఆర్‌బిఐ పెంచిన రేటును కూడా అమలు చేసే అవకాశముంది. 20 ఏళ్ల హోమ్ లోన్‌పై నెలసరి వాయిదాలు(ఇఎంఐ) మరింత భారం అవుతాయి. ఏప్రిల్‌లో 6.65 శాతం ఉన్న రేటు ఆగస్టుకు వచ్చేసరికి 8.05 శాతానికి పెరగడం వల్ల ఇఎంఐలు మరింత పెరుగుతాయి.
ఐసిఐసిఐ బ్యాంక్, పిఎన్‌బి
ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఐ ఇబిఎల్‌ఆర్) ఆర్‌బి ఐ రెపో రేటును అనుసరిస్తుందని ఐసిఐసిఐ బ్యాంక్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అంతకుముందు ఆర్‌బిఐ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడానికి ముందు ఐసిఐసిఐ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసిఎల్‌ఆర్) 0.15 శాతం మేరకు సవరించింది.

ఇఎంఐలు పెరిగితే పాటించాల్సిన సూత్రాలు:

రీఫైనాన్స్..

లోన్ రేటు, మార్కెట్ రేటు మధ్య పెద్ద (0.25 -0.50 శాతం) వ్యత్యాసం ఉన్నప్పుడు రీఫైనాన్స్ హోమ్ లోన్ చూడాలి. రీఫైనాన్స్ అంటే బ్యాలెన్స్ బదిలీ ఎంపికను స్వీకరించడం జరుగుతుంది. ఒక వినియోగదారుడు తీసుకున్న రేటు 7.50 శాతం, మార్కెట్‌లో 7 శాతానికే రుణం పొందుతున్నారని అనుకుందాం. ఈ పరిస్థితిలో బ్యాలెన్స్ బదిలీ ప్రయోజనకరంగా ఉంటుంది. రుణానికి 20 సంవత్సరాలు మిగిలి ఉంటే, ప్రతి రూ. 1 లక్ష రుణానికి రూ.7,400 ఆదా చేస్తారు. సగం కంటే ఎక్కువ రుణ పదవీకాలం మిగిలి ఉంటేనే బ్యాలెన్స్ బదిలీ సరైన నిర్ణయం అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజులు, ఎంఒడి వంటి బదిలీ చార్జీలు కూడా ఉంటాయి.

ముందస్తు చెల్లింపు

ముందుగా చెల్లించడం ద్వారా ఇఎంఐ తగ్గించవచ్చు. అసలు మొత్తం అంటే లోన్‌లో తీసుకున్న మొత్తం ప్రీ-పెయిడ్ మొత్తం నుండి సర్దుబాటు చేస్తారు. ఈ మొత్తాన్ని తగ్గించినట్లయితే దాని ప్రభావం ఇఎంఐపై ప్రతిబింబిస్తుంది. కనీసం సంవత్సరానికి ఒకసారి ముందుగా చెల్లించి లోన్ ప్రిన్సిపల్‌ను తీసివేయవచ్చు.

లోన్ కాలపరిమితి పెంపు

హోమ్ లోన్ ఇఎంఐ కారణంగా నెలవారీ ఖర్చులు ప్రభావితం కావడం చాలా సార్లు జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు అదనపు ఆదాయాన్ని లేదా పొదుపును పొందలేకపోతే, మీరు రుణం కాలపరిమితిని పెంచడం ద్వారా ఇఎంఐని తగ్గించవచ్చు. కానీ, మీరు ఎక్కువ వడ్డీ చెల్లించవలసి ఉంటుంది కాబట్టి ఇందులో ప్రతికూలత ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News