Thursday, May 2, 2024

లాక్‌డౌన్ కొనసాగించాల్సిందే

- Advertisement -
- Advertisement -
CM KCR

 

మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోడీని కోరా
జూన్3 వరకు లాక్‌డౌన్ కొనసాగించాలని బోస్టన్ సర్వే చెప్పింది
అమెరికాలోనే శవాలను ట్రక్కుల్లో నింపుతున్నారు
అంతటి విపత్తు మనదాకా వస్తే పరిస్థితి ఏంటీ?
కరోనా వస్తే కోటీశ్వరులైన గాంధీలో ఉండాల్సిందే
‘మర్కజ్ ’ లేకుంటే ఈ పరిస్థితి కూడా ఉండేది కాదు
25,937 మందిని క్వారంటైన్ చేశాం
త్వరలో 258 మందిని డిశ్చార్జి చేయబోతున్నాం
5లక్షల కిట్లకు ఆర్డరిచ్చాం, 17వేల బెడ్లు సిద్ధం చేసుకున్నాం
ఇలాంటి సమయంలో వెకిలి వార్తలు రాయొద్దు
ప్రధానమంత్రి దీపం పట్టుకొమ్మంటే జోకులేస్తారా?
వక్రబుద్ధి ఉన్నోళ్లకు కరోనా రావాలని శాపం పెడుతున్నా
ప్రాజెక్టులన్నీ పూర్తయితే కోటి ఎకరాల్లో సాగు గ్యారంటీ
గన్నీ బ్యాగుల కొరత తీర్చేందుకు బెంగాల్ సిఎం హామీ ఇచ్చారు
మళ్లీ ఈ సమస్య రాకుండా ఇక్కడే సంచుల తయారీ పరిశ్రమ
ప్రగతిభవన్ మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్
సంక్షోభ వేళ వరాల వాన
వైద్య సిబ్బందికి గ్రాస్ సాలరీలో 10శాతం అదనం, జిహెచ్‌ఎంసి పారిశుద్ధ సిబ్బందికి రూ.7,500, మున్సిపల్, పంచాయతీ సఫాయి కర్మచారీలకు రూ.5,500
సఫాయి కర్మచారీలకు సలాం
కరోనాపై యుద్ధంలో అందరికి మించి ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు వైద్య సిబ్బంది. వాళ్లకు రెండు చేతులెత్తి దండం పెడుతున్నా. మొన్ననే పూర్తి జీతాలిచ్చాం. వాళ్లను సేవలను గుర్తించి తాజాగా ‘సిఎం గిఫ్ట్’ కింద వాళ్లందరికీ 10శాతం గ్రాస్ శాలరీ ఇస్తాం. సఫాయి అన్నా నీకు సలాం. మరీ కరోనా నుంచి కాపాడుతున్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేయండి. మీకు గుర్తింపు ఉంటుంది. జిహెచ్‌ఎంసిలో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి రూ.7500, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తే పారిశుధ్య కార్మికులకు తలో 5వేలు అదనంగా ఇస్తాం. పోలీసు సిబ్బంది కూడా అద్భుతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు
బతికుంటే బలుసాకు తినొచ్చు. ప్రాణాల్ని తిరిగి తేలేం కదా. సతీసావిత్రి పురాణంలో తప్పితే చనిపోయిన వాళ్లను వాపస్ తేలేం. లాక్‌డౌన్ ఎంత గట్టిగా పాటిస్తే అంత మంచిది. 21 రోజుల పాటించి ఒక్క సారే ఎత్తేస్తే వైకుంఠపాళిలో పెద్ద పాము మింగేసిన తీరు అయితది. అంతులేని విషాదం జరిగితే ఈ నాగరిక సమాజం భరించలేదు. ప్రధానమంత్రి మోడీగారు అడిగితే లాక్‌డౌన్ కొనసాగించమనే కోరా. కరోనా వల్ల ఆదాయం తగ్గినా మరణాల్లేవు. అమెరికా లాంటి దేశాలే కరోనాను కట్టడి చేయలేకపోయాయి. అక్కడ శవాల కుప్పలు పడుతున్నాయి. భారత్ లాంటిదేశంలో లాక్‌డౌన్ మినహా మరో దారిలేదు. ఎత్తివేస్తే మళ్లీ ఆగమైతం.

మన తెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 15 తరువాత కూడా కొనసాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కో రారు. మరో వారం, రెండు వారాలు పొడగింపు ఉండాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని చెప్పినట్లు సి ఎం తెలిపారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఆర్థికంగా ఎంత నష్టపోయినా, తరువాత ఎకనామీని గాడి లో పెట్టవచ్చునని, అయితే చనిపోయిన వాళ్లను మాత్రం వాపస్ తీసుకురాలేమన్నారు. బతికుంటే బలిసి ఆకులు తినైనా బతుకుతామన్నారు. మనది అభివృద్ధి చెందుతున్న దేశమని, కరోనా కట్టడికి ఇప్పుడు మనముందున్న ఏకైక ఆయుధం లాక్‌డౌన్ మాత్రమేనని చెప్పారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడా ఒక సర్వే చేసిందని, వీళ్లు చెప్పేదా ని ప్రకారం జూన్ 3 దాకా దేశంలో లాక్‌డౌన్ ఉం డాలన్నారు. అమెరికాలాంటి దేశంలోనే చాలా ద యనీయంగా శవాల గుట్టలుగా ఉంటున్నాయని, ఇది మనుషులకు సంభవించకూడని హృదయ వి దాకర సంఘటనగా కెసిఆర్ పేర్కొన్నారు. ట్రక్కు లు నింపి పంపుతున్నారు. చాలా దయనీయ పరిస్థితి. చావుకు కొడుకులు లేరు. బిడ్డలు లేరు. దిక్కుమాలిన పరిస్థితి. శక్తివంతమైన దేశం కూడా అసహాయతకు గురైంది. అలాగే మనకోస్తే కోట్ల మం ది చనిపోయేవాళ్లు. లాక్‌డౌన్‌తోనే కంట్రోల్ చేసుకున్నామని, జనతా కర్ఫూ, లాక్‌డౌన్ తో దేశం అద్భుతమైన విజయం సాధించిందని సిఎం వ్యా ఖ్యానించారు. ప్రగతి భవన్‌లో సోమవారం ము ఖ్యమంత్రి కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. కరో నా కోసం ఎనిమిది ఆసుపత్రులు ఏర్పాటు చేసుకున్నామని, అందులో గాంధీ ప్రధానమన్నారు. ఎవరికి పాజిటివ్ వచ్చినా కోటీశ్వరులైనా, ఇంకెవరైనా సరే గాంధీలో ఉండాల్సిందేనని సిఎం స్పష్టం చేశారు. వాస్తవంగా నిజాముద్దీన్ ఘటన లేకుంటే తెలంగాణలో ఇంత ఘోర పరిస్థితి ఉండేది కాదన్నారు. వైరస్ సోకుతుందని తెలిసినా కుటుంబానికి దూరంగా ఉంటూ, సమయాన్ని కోల్పోతూ క రోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యశాఖ లో ఉన్నవారందరికీ అదనంగా 10 శాతం వేతనం సిఎం ప్రత్యేక ప్రోత్సాహకం కింద అందించనున్నట్లు సిఎం వెల్లడించారు.

గ్రామాల్లో పనిచేస్తున్న 43,661 పారిశుధ్య కార్మికులకు, మున్సిపాలిట్లీ 21,531 మంది కార్మికులకు రూ.5000 చొప్పున ఇస్తామన్నారు. అలాగే జిహెచ్‌ఎంసిలో 21,531 మంది, హెచ్‌ఎండబ్లుస్ 2510 కార్మికులకు రూ.7500 చొప్పున సిఎం ప్రత్యేక ప్రోత్సాహకం కింద ఇస్తామన్నారు. వీరికి కట్ చేసిన 10 శాతం వేతనం కూడా చెల్లించనున్నట్లు వెల్లడించారు. సఫాయి అన్న నీకు సలాం అని మరోమారు చెబుతున్నా. మీరు కరోనా నుంచి కాపాడుతున్న కనిపించే దేవుళ్లు. మీకు గుర్తింపు ఉంటది. ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుంటది. గొప్ప సేవ అలాగే కొనసాగించాలి. వంద కోట్ల రూపాయాలైన ఈ రోజే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినట్లు కెసిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ వైద్యశాఖలో ఉన్న స్లీపర్ దగ్గర నుంచి పెద్ద డాక్టర్ వరకు పాదాభివందనం చేస్తున్నా అన్నారు. అన్ని కేటాగిరిలలో 25 వేల మంది వైద్య సిబ్బంది పూల్‌ను పెట్టుకున్నామన్నారు. జిల్లాల్లో అక్కడక్కడ రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని, వాళ్లను కూడా ప్రోత్సాహించేందుకు జిల్లా కలెక్టర్ల దగ్గర కొంత డబ్బు పెడుతున్నట్లు సిఎం తెలిపారు.

ఎత్తేస్తే వైకుంఠపాళి పెద్ద పాము మింగినట్లే
లాక్‌డౌన్ ఎంత గట్టిగా పాటిస్తే అంత మంచిదని, ఒక్కసారే ఎత్తేస్తే ఎవరిని వదలాలి. కుప్పలు, కుప్పలు, మసీదులు, బార్లు, పబ్బులు మొదలైతయి. ఎటుపోతాం. ఏమైతం. ఎంత బాధ్యతతో ఆలోచించి తీయాలి. చర్చలు జరుగుతున్నాయి. రోజుకు రెండుసార్లు ప్రధానితో చాలాసేపు మాట్లాడుతున్నా. రాష్ట్రాలు, కేంద్రాలు, ఫైనాన్స్, ఆర్‌బిఐ, ఆహార నిల్వలు వంటి వాటిపై తీవ్రమైన చర్చ చేస్తున్నాం. మనిషి జీవితంలోనే ఇటువంటి సంఘటన లేదు. విచిత్ర పరిస్థితి. ఈ సమయంలో మ మ్మల్ని బంధించారనే భావన రావొద్దు. 21 రోజులు పాటించి, ఒక్కసారే ఎత్తేస్తే వైకుంఠపాళి పెద్ద పాము మింగేసిన తీరు అయితదని సిఎం పేర్కొన్నారు. సతీ సావిత్రి పురాణం ఒక్కటి తప్పితే చనిపోయిన వాళ్లను వాపస్ తేలేం. ఇప్పుడు దేశం చాలా సేఫ్‌గా పోతుందన్నారు. అంతర్జాతీయ జర్నల్స్ చెప్పాయని, ఐక్యతను ప్రదర్శించి మంచి పనిచేశారని ప్రశంసించాయని తెలిపారు.

ఆరు రోజుల్లో రూ.6 కోట్లే వచ్చింది
లాక్‌డౌన్‌తో ఆర్థికంగా దెబ్బతింటాం. అవును. తెలంగాణ రాష్ట్రానికి ఒకరోజు సగటున రూ.400 నుంచి రూ.430 కోట్లు రావాలి. మార్చిలో 15 రోజులు ఆదాయం వచ్చింది. మిగతా రోజులు సున్నా. ఏప్రిల్‌లో ఈ ఆరు రోజుల్లో రూ.2300 కోట్లు రావాలి. కానీ వచ్చింది రూ.6 కోట్లు. ఇవి చాలా బాధకరంగా ఉంది. మనం ఎట్ల ఉంటే దేశం గతి కూడా అట్లనే ఉంటుంది. ఎంపిలకు 30 శాతం కాదు, 50 శాతం పెట్టుమని మోడీకి చెప్పినట్లు సిఎం తెలిపారు. బుధవారం ఫ్లోర్ లీడర్లతో పిఎం వీడియో కాన్ఫరెన్స్‌లోనూ సపోర్ట్ చేయాలని తమ ఫ్లోర్ లీడర్లకు చెప్పినట్లు పేర్కొన్నారు.

నేటితో మొదటి ఫేజ్ సేఫ్
రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చిన 25,937 మందిని క్వారంటైన్ చేసి, ప్రభుత్వ పర్యవేక్షణలో పెట్టాం. మొదటి ఫేజ్‌లో 50 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ 50 మందిలో విదేశాల నుంచి వచ్చిన వారు 30 మంది కగా వారి సన్నిహిత, కుటుంబ సభ్యులకు తెలియక 20 మందికి అంటించారు. అదృష్టం దానిలో ఒక్కరూ కూడా చనిపోలేదు. తొందరగా వచ్చారు కాబట్టి కంట్రోల్ చేయగలిగాం. 35 మంది డిశ్చార్జ్ చేశాం. మరో 15 మంది ఎల్లుండిలోగా డిశ్చార్జ్ అవుతారు.

మరో 170 కేసులు వచ్చే అవకాశం
ఇక మధ్యలో వచ్చిన కేసులు నిజాముద్దీన్ మర్కజ్ సంఘటన దేశం అంతా అతలాకుతలం చేసింది. మొదటి 50తో కలిపి, మొత్తంగా 364 కేసులు నమోదయ్యాయి. 10 మంది ఇండోనేషియా వాళ్లు కూడా ఇందులోనే ఉన్నారు. వీళ్లు కూడా డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 45 మంది డిశ్చార్జ్ కాగా 11 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చనిపోయారు. గాంధీ ఆసుపత్రిలో 308 మంది చికిత్స పొందుతున్నారు. వీటికి తోడు ఇంకా 170 కేసులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. అక్కడితో ఆగిపోవాలని భగవంతుణ్ని కోరుకుంటున్నట్లు సిఎం వ్యాఖ్యానించారు.

ఈ 15 కల్లా నిజాముద్దీన్ కథ పూర్తి
నిజాముద్దీన్ దరిమిలా నుంచి మొత్తం 1089 మంది గుర్తిపట్టినం. వీళ్లు రాష్ట్రంలోనే ఉన్నారు. ఇంకో 30 నుంచి 35 మంది ఢిల్లీలోనే ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక్కడ గుర్తించిన వాళ్లలో 172 పాజిటివ్ మందికి వచ్చింది. చనిపోయిన వాళ్లు ఇందులోనే ఉన్నారు. 172 మంది ద్వారా వారికి సన్నిహితంగా మెదిలిన 93 మంది కుటుంబ సభ్యులకు అంటించారు. అందరిని కూడా పట్టుకున్నారు. సుమారు 3015 మంది ప్రభుత్వ ఐసోలేషన్, క్వారంటైన్‌లో ఉన్నారు. ఒకే మతం వాళ్లు లేరు. హిందువులు కూడా ఉన్నారు. ఉన్నవారికి కాకుండా మిగతా వారిలో దాదాపు వెయ్యి పైచిలుకు జబ్బు లేదని వచ్చింది. ఇంకా 600 టెస్టులు పరీక్షించారు.

రెండు రోజుల్లో వీళ్లది కూడా ఏదో తేలుతుంది. అంటిన దాన్నిబట్టి, అంటించిన దానిని బట్టి కేసులు పెరుగుతున్నాయి. 15వ తేదీ కల్లా ఈ కథ పూర్తయితది. నిజాముద్దీన్ పోయి వచ్చిన వారిని 99.99 శాతం పట్టుకున్నామని, ఎవరైనా ఉంటే రావాలన్నారు.కరోనా వైరస్ యావత్ మానవజాతి ఎదుర్కొంటున్న సంక్షోభం. 22 దేశాలు వందశాతం లాక్‌డౌన్ చేశాయి. మిగతా 90 దేశాలు పాక్షికంగా లాక్‌డౌన్ చేశాయి. సమస్య తీవ్రత ఎంత ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చునని సిఎం తెలిపారు. ఇదేదో శిక్ష, మాకే ఉన్నదని వ్యక్తులు, కుటుంబాలు అనుకోవద్దని కోరారు.

వైరస్ లోడ్ ఎక్కువై చనిపోయారు
నేను, మంత్రి ఈటల, సిఎస్ మాట్లాడుకుంటున్నాం. గాంధీ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఒకాయన సీరియస్ ఉన్నడు అని చెప్పారు. ఆ తరువాత మళ్లీ వెంటిలేటర్ అని చెప్పారు. 40 నిమిషాల్లో చనిపోయినట్లు వైద్యులు ఫోన్‌లో తెలిపారు. ఆ తరువాత బాత్‌‌ంరలో జారిపడి మరొక పేషెంట్ చనిపోయాడన్నారు. పాజిటివ్ వచ్చిన తరువాత బతుకిన వారందరికీ వైరస్ తక్కువ లోడ్ ఉంది. ప్రాథమిక దశలోనే వస్తే ప్రపంచం మొత్తం ఏ రకంగా వైద్యం చేస్తున్నారో అలాగే హైడ్రాక్సి క్లోరోక్విన్‌తో చికిత్స చేస్తున్నట్లు సిఎం వివరించారు. ఇంద్రకరణ్ రెడ్డి ఒక ఫోన్ చేసిండు సీరియస్ ఉన్నడు పంపిస్తున్నామని, మధ్యలోనే చనిపోయారు.

5 లక్షల కిట్స్‌కు ఆర్డర్
పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ముందస్తుగానే సుమారు 16వేల 17వేల బెడ్లు సిద్ధంగా చేసుకున్నాం. ప్రభుత్వం దగ్గర 40 వేలు పిపిఇ కిట్స్ ఉన్నాయి. ఇంకా 5లక్షల కిట్లకు ఆర్డర్ చేశాం. లక్షాలాది మాస్కులకు ఆర్డర్ చేశాం.

ఆ సంఘటన చదువుతుంటే కన్నీళ్లు
రాధా అనే ఒక అమ్మాయి సికింద్రాబాద్‌లో కూలీ పనిచేసుకునే అమె జ్వరంతో చనిపోయింది. నలుగురు పిల్లలు ఆనాథాలు అయ్యారు. ఒక పేపర్‌లో ఆ సంఘటన చదువుతుంటే కన్నీళ్లు వచ్చాయి. ఆ పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుం ది. అలా కరోనాతో ఎక్కవ సంఖ్యలో జనాలు చనిపోతే వారి కుటుంబాలు బజారున పడి ఎటుకాని పరిస్థితి. ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతాయి. ఒళ్లు జలదరించే పరిస్థితి.

గొప్ప వ్యక్తులు కావాలి
ఈ ప్రత్యేక, విపత్కర సమయంలో ముందుకు తీసుకెళ్లెందుకు గొప్ప వ్యక్తులు కావాలి. చిల్లర వాళ్లు కాదు కావాల్సింది. బా ధ్యత కలిగిన వాళ్లు సమాజానికి కావాలి. ఈ టైంలోనే అల్పు లు, గొప్పవాళ్లు బయటపడుతారు. ఈ సమయంలో శవ రాజకీయం చేసేది కాదు. మానవజాతి సంక్షోభంలో ఉంటే చిల్లర విషయాలు చేయొద్దని సిఎం కోరారు. కవులు, గాయకులు సమజానికి మానసిక ధైర్యాన్ని కల్పించాలన్నారు. సోషల్ మీడియా కాస్తా యాంటీ సోషల్ మీడియా అవుతుందన్నారు.

ఇదేం పద్ధతి. ఏం సంస్కారం
ప్రధానమంత్రి దీపం పట్టుకోమంటే జోకులు, సెటైర్లు ఎందుకయ్యా. దానిని కూడా ఎకిలి చేస్తారా? ఇదేం పద్ధతి. ఏం సంస్కారం. సంఘీభావ సంకేతం అంటే కష్ట సమయంలో కలిసికట్టుగా ఉన్నామని చెప్పడమేనని కెసిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వంద చేసినం. గంటలు మోగించాలంటే.. గంటలు మోగిస్తే తెలంగాణ వస్తదా అన్నరు.. ఒచ్చింది. అట్ల ఎన్నో చేసినం. ఒక సమస్య మీద పోరాడుతున్నప్పుడు మనిషికి.. మనిషి అవసరం. ప్రధాన మంత్రి ఒక వ్యక్తి కాదు.. ఇనిస్టిట్యూషన్, వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఉండదు. దాన్ని కూడా పద్ధతి లేకుండా చేసినవాళ్లు కుసంస్కారులు. సమాజం క్షమించదని సిఎం పేర్కొన్నారు.

గదే గొప్పతనం
వక్రబుద్ధి ఉన్నవాళ్లు సక్రమంగా తయారు కావాలి. గ్యారంటీ అలాంటి వాళ్లకు కరోనా రావాలని శాపం పెడుతున్నా. చాలా ఆవేదనతో చెబుతున్నా. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు ఉన్నా యి. అలా చేసే వారు ప్రజా ద్రోహులు, దేశ ద్రోహులు. దుర్మార్గంగా, కుంచిత బుద్దితో అసత్యాలు ప్రచారం చేసేవారికే చెబుతున్నానని సిఎం తెలిపారు. ఇగో గా బియ్యం ఇచ్చినవాళ్లు గొప్ప.. రూ.20 వేల ఇచ్చినవాళ్లు గొప్ప. సర్పంచ్‌లు స్ప్రేలు చేస్తున్నరు. మోరీలు తీస్తున్నరు. గదీ గొప్ప అని అన్నారు.

తెలంగాణ ధాన్యాగారం
తెలంగాణ భారతదేశానికి ధాన్యాగారంగా తయారైందని సిఎం అన్నారు. ప్రాజెక్టులు అన్నీ పూర్తయితే కోటి ఎకరాల వరి సాగవుతుందన్నారు. ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు బియ్యం పంపిణీ చేస్తున్నామని, రాష్ట్రంతో తెల్ల రేషన్ కార్డులు లేని పేదవారికి కూడా ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గన్నీ బ్యాగుల కొరతను తీర్చేందుకు పిఎంతో, పశ్చిమబెంగాల్ సిఎంతో మాట్లాడానని సరఫరా చేయనున్నట్లు చెప్పారని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ సమస్య మళ్లీ రాకుండాగన్నీ బ్యాగ్ ఇండస్ట్రీ ఇక్కడే పెట్టేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ తప్పుడు వార్తలే వద్దు…
తాను లాక్‌డౌన్‌ను జూన్ ౩ వరకు పొడిగిస్తున్నట్లు చెప్పలేదని.. మీడియాతో లైవ్‌తో మాట్లాడుతుండగానే పొడి గించారని తప్పుడు వార్తలు ఇవ్వడంపై సిఎం కెసిఆర్ సీరియస్ అయ్యారు. ఇలాంటి వార్తలే వద్దని కోరుతున్నానని, ఆ తప్పుడు వార్తను ఫోన్‌లో మీడియాకు చూపారు. ప్రధానమంత్రికి లాక్‌డౌన్ పొడిగిస్తేనే మేలని చెప్పానన్నారు. బోస్టన్ సర్వే కూడా జూన్ ౩ వరకు భారత్‌లో లాక్‌డౌన్ కొనసాగిస్తేనే మంచిదని సూచించిందన్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించానన్నారు.

Lockdown should continue
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News