Wednesday, May 1, 2024

సర్కారు ఆసుపత్రులకు సలామ్

- Advertisement -
- Advertisement -

CM KCR

 

కరోనా కట్టడిలో సర్కారు దవాఖానాల తడాఖా
‘నేను రాను’ నుంచి ‘నేను వస్తా’ దాకా..

ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని ప్రభుత్వాసుపత్రుల వైద్యంతోనే కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం సఫలీకృతమయ్యే దిశలో ముందుకు సాగుతున్నది. కరోనాపై యుద్ధం చేయడంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అం దుతున్న పరీక్షలు, చికిత్సలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వాసుపత్రులు ము నుపెన్నడూ లేని విధంగా సేవలు అందిస్తున్నాయని కరోనా ను ంచి విముక్తి పొందిన బాధితుల కథనాలు చెపుతున్నాయి. తెలంగాణలో గతంలో సర్కారు ఆసుపత్రి అంటే ‘నేను రాను బిడ్డో’ అని పాడుకునే పాటను తిరగరాయాల్సిన విధంగా ప్రైవేటు ఆ సుపత్రులను ఆశ్రయించకుండా కరోనాను కెసిఆర్ తన సైన్యం తో ఎదుర్కొంటున్నారు. టెస్టుల నుంచి వైద్యం దాకా ఇప్పటి దా కా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించకుండా సర్కారు ఆసుపత్రులతోనే కరోనాను ఎదుర్కొనే విధంగా ప్రభు త్వం సకల సౌకర్యాలు, మందులు సిబ్బందితో యుద్ధానికి రెడీ అన్నట్లుగా సంసిద్ధంగా ఉంది.

ఈ విషయంలో అమెరికా , స్పెయిన్, ఇటలీలాంటి దేశాలు శవాలను ఎలా వదిలించుకోవాలనే తర్జన భర్జనలు పడుతుండగా, కెసిఆర్ మాత్రం రాష్ట్రంలో ఎంత మందికి కరోనా పాజిటివ్ వచ్చినా చికిత్స సంపూర్ణంగా అందించడానికి వైద్య ఆరోగ్య యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్న తీరు తెలంగాణ చరిత్రలో అరుదు అని చెప్పవచ్చు. ప్రైవేటు ఆసుపత్రులు పాజిటివ్‌ను నిర్ధారించే పరీక్షల కోసం అనుమతి అడుగుతున్నా, ఐసిఎంఆర్ అనుమతించినా కెసిఆర్ అంగీకరించకపోవడం సాధారణ విషయం కాదని ఆసుపత్రి వర్గాలు చెపుతున్నాయి. ప్రభుత్వాసుపత్రులు కరోనాను ఎదుర్కోవడంలో చతికిలపడితే తప్ప తాను ప్రైవేటును అంగీకరించలేనని ఎన్ని వత్తిడులు వచ్చినా సర్కారీ ఆసుపత్రుల తర్వాతే ఏదైనా అని చెపుతున్న సిఎం బహుశా దేశ చరిత్రలో అరుదనే చెప్పవచ్చు. ప్రపంచంలో, దేశంలో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తున్నా ప్రభుత్వం లాక్‌డౌన్, కర్ఫూలతో ప్రజల దైనందిన అవసరాలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారు.

సంక్షోభ యాజమాన్యాన్ని సాహసోపేత నిర్ణయాలతో విజయవంతంగా కొనసాగిస్తూ, రాగల ఉపద్రవాన్ని ముందే దూరదృష్టితో పసిగట్టి అందుకు తగ్గట్లుగా ప్రభుత్వాసుపత్రులను సన్నద్ధం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నభూతో, నభవిష్యతి అన్నట్లుగా ముందంజలో ఉంది. ఏప్రిల్ 15 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేసినా, సడలించినా ఎలా ఉన్నా తెలంగాణ ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం కఠినాతి కఠిన చర్యలకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. మున్ముందు ఎంత మందికి పాజిటివ్‌లు వచ్చినా వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించి వారి ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపడానికి ఆసుపత్రులను సదుపాయాలను సమాయత్తం చేసిం ది. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కూడా కరోనా ఉందా లేదా అని ప్రాథమికంగా పరీక్షించే విధంగా ఆసుప త్రులను మెరుగుపర్చింది. అవసరమైన వారిని మాత్ర మే హైదరాబాద్‌కు తరలించి ఇక్కడ ఆసుపత్రు లపై భారం పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంది. సాధ్యమైనంత వరకు పాజిటీవ్ లక్షణాలు లేకుంటే జిల్లా కేంద్ర ఆసుపత్రులలోనే చికిత్సలు చేస్తున్నారు.

రూ. 12 కోట్లతో కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులకు, సిబ్బందికి ఇవ్వడానికి లక్ష పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్‌ను రెడి చేసింది. చికిత్సలో కీలకమైన 2200 వెంటిలేటర్లను కూడా సిద్ధం చేసింది. కరోనాలో ప్రధాన సమస్యగా మారిన వ్యాధిని నిర్ధారించే 500 టెస్టు కిట్లను తీసుకు రాబోతున్నది. వీటితో 50,000 మందికిపైగా కొన్ని గంటల్లో చికిత్స ఉందా లేదా అని నిర్ధారించవచ్చు. అలాగే ఈ వ్యాధి నిర్ధారణ అయిన వారికి కాస్తో కూస్తో ఉపశమనం కలిగిస్తుందని చెపుతున్న హైడ్రాక్సి క్లోరో క్వీన్ మాత్రలను 50 లక్షల దాకా అప్పుడే సమకూర్చుకున్నది. ఇంకా 20 లక్షల ఐవి ఫ్లూయిడ్స్, 50 లక్షల శానిటైజర్లు, మాస్కు లు, శ్వాస సంబంధ పరికరాలను అందుబాటులో పెట్టింది. ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా తట్టుకోడానికి 8 దాకా ప్రభుత్వాసుపత్రులను నోటిఫై చేసింది. గతంలో అంతగా సౌకర్యాలు లేని కింగ్ కోఠి ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపదికన కరోనాకు అనుగుణంగా సదుపాయాలు సమకూర్చారు.

కొత్తగా గచ్చిబౌలి లాంటి ప్రాంతాల ప్రభుత్వ ప్రాంగణాలను సకల సౌకర్యాల కరోనా ఆసుపత్రులుగా మార్చింది. ముందే ఉపద్రవా న్ని దృష్టిలో పెట్టుకొని దేశీయంగా పేరు ప్రతిష్ఠలున్న సిసిఎంబిని తగిన సౌకర్యాలతో త్వరితగతిన కరోనా పరీక్షలకు సిద్ధం చేసింది. దీని కోసం సిఎం కెసిఆర్ ప్రధాని మోడీకి ప్రత్యేక విజ్ఞప్తి చేసి అనుమతి సాధించి సిసిఎంబి కరోనా పరీక్షలకు కేంద్రంగా మార్చారు. కొత్తగా 16,000 బెడ్లను సిద్ధం చేసింది. 25,000 మందిని అదనంగా అత్యవసరంగా తీసుకోవడానికి వైద్య పూల్‌ను కూడా సంసిద్ధం చేసింది. మందు వ్యాక్సిన్‌లేని కరోనాను ఎదుర్కొవడానికి ఇంతగా ఏర్పాట్లు చేసిన రాష్ట్రం దేశంలో ఇప్పటి దాకా లేదని చెప్పడం తెలంగాణవాసులు గర్వంగా చెప్పుకోవలసిన సందర్భమిదని చెప్పవచ్చు. లాక్‌డౌన్, కర్ఫూను కొనసాగిస్తేనే దేశానికి, రాష్ట్రానికి క్షేమమని, ప్రాణాలను మించిన ఆర్థికం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన సాహస ముఖ్యమంత్రి కూడా మరొకరు లేరని చెప్పవచ్చు.

తెలంగాణలో ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా ఆ తర్వాత మర్కజ్ నుంచి వచ్చిన వారే ఎక్కువగా కరోనా బాధితులుగా ఉన్నా రు. 25,000 మందికి పైగా క్వారంటైన్ చేసిన వారి లో 308 మినహా మిగిలిన వారంతా ఏప్రిల్ 9 లోపు ఇంటికి పంపే ఏర్పాట్లలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఉంది. కఠోర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం అతలాకుతలం చేయకుండా ఆర్థిక క్రమశిక్షణను, ఉన్నదాన్ని పంచే త్యాగ గుణాన్ని ఓ ఉద్యమంలా కొనసాగిస్తున్న ప్రభుత్వం కూడా ఇదేనని చెప్పవచ్చు. కరోనాను ఎదుర్కోవడానికి అందరూ త్యాగాలకు సిద్ధం కావాలని, వ్యాధి నివారణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రేయింబవళ్లు పని చేస్తున కీలకమైన పారిశుద్ధ, వైద్య సిబ్బందికి సిఎం గిఫ్ట్‌ను ప్రకటించి ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.

 

Salute for Government Hospitals
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News