Thursday, May 2, 2024

దశలవారీ ఎత్తివేత!

- Advertisement -
- Advertisement -

PM MODI

 

మంత్రులకు ప్రధాని మోడీ సంకేతాలు
నెమ్మదిగా పనుల ప్రారంభానికి ఆయా శాఖల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన
దేశంలో కరోనా హాట్‌స్పాట్లలో
లాక్‌డౌన్ కొనసాగింపునకే మొగ్గు
దేశ చరిత్రలో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి వర్గం సమావేశం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను సడలించేందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోడీ మంత్రులను కోరారు. మంత్రిమండలి స మావేశంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసే విషయమై మంత్రులతో చర్చించారు. కరోనా హాట్‌స్పాట్‌లు ( తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు) మినహాయించి మిగతా ప్రాంతాల్లో దశలవారీగా ఆంక్షలను సడలించేందుకు ప్రణాళిక ఉండాలని ప్రధాని వారికి సూచించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కోవిడ్19 ప్రభావం గురించి ప్రధాని మంత్రులతో చర్చించారు. ఈ ప్రభావాన్ని తగ్గించేందు కు యుద్ధ ప్రాతిపదికపై ప్రభుత్వం పని చేయా ల్సి ఉంటుందని ఆయన సూచించారు.ప్రతిమంత్రిత్వ శాఖ ఆయా రంగాల్లో పనుల కొనసాగింపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘కరోనా ప్రజ్వలన కేంద్రాలను (హాట్‌స్పాట్) మినహాయించి మిగతా ప్రాంతాల్లో ఒక్కో శాఖ నెమ్మదిగా పనులు ప్రాంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేయండి’ అని ప్రధా ని సూచించారని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేసింది.

లాక్‌డౌన్ ముగిసిన తర్వాత తీసుకోవలసిన పది కీలక నిర్ణయాలు, పది ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రధాని సహచర మంత్రులకు సూచించారు. ఇందుకు సంబంధించి ఆయన ఆయా శాఖల మంత్రులకు దిశానిర్దేశం చేశారు. కాగా పంటల కోత సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా కేంద్రం అన్ని విధాల సహా య సహకారాలను అందిస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు. రైతులను, మండీలతో అనుసంధానం చేయడానికి యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసులు తరహాలో ‘ట్రక్ అగ్రిగేటర్స్’ లాంటి వినూత్న పరిష్కారాలను ఉపయోగించే అవకాశాలను పరిశీలించాలని కూడా ఆయన మంత్రులకు సూచించారు.

లాక్‌డౌన్ ఉపశమన చర్యలు, సామాజిక దూరం పాటించడానికి సంబంధించిన నిబంధనలు ఏకకాలంలో సాగాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలతో మంత్రులు నిరంతరం సంప్రదించాలని, అక్కడి వాస్తవ పరిస్థితులపై పూర్తి అవగాహనకు వచ్చి వాటిని పరిష్కరించాలని కూడా ప్రధాని సూచించారు. కాగా కరోనా ప్రభావాన్ని తగ్గించడంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడానికి తీసుకొన్న చర్యల గురించి సమావేశంలో మంత్రులు ప్రధానికి వివరించారు.

ఇదే తొలిసారి..
కాగా, కేంద్ర మంత్రివర్గ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం దేశ చరిత్ర లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రధాని నివాసంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధానితో పాటుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్‌షా, కొంతమంది సీనియర్ అధికారులు పాల్గొనగా, మిగతా కేంద్ర మంత్రులు అందరూ వీడియో లింక్ ద్వారా అనుసంధానం అయ్యారు.

Step-by-step Lockdown easing
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News