Monday, April 29, 2024

రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

covid-19

 

364కు చేరిన పాజిటివ్‌ల సంఖ్య
జిల్లాల్లో క్రమంగా విస్తరిస్తున్న వ్యాధి
నిజామాబాద్‌లో తాజాగా
పది మందికి వైరస్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మర్కజ్‌లింక్‌తో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా మరో 30 కేసులు పెరగడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసులు సంఖ్య 364కి చేరింది. సోమవారం వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం డిశ్చార్జ్ సంఖ్య 45కి పెరిగింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 308 మంది చికిత్స పొందుతున్నారని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. మరో 600 శాంపిల్స్‌కి రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

పాజిటివ్స్ వయా నిజాముద్దీన్..
రాష్ట్రంలోవారం రోజులుగా నమోదవుతున్న కేసులన్నీ నిజాముద్దీన్ ప్రార్థనల నుంచి వస్తున్నాయి. ప్రార్థనల్లో పాల్గొన్న 1089 మందికి పరీక్షలు చేయగా, మొత్తం 170 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. వీరు మరో 93 మందికి(కుటుంబ సభ్యులు మాత్రమే) వైరస్‌ను అంటించారని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే మర్కజ్ లింక్‌తో సంబంధమున్న 3వేల మందిని క్వారంటైన్ చేశామని, ఇంకా ట్రెసింగ్ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రం నుంచి మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న మరో 30 నుంచి 35 మంది ఢిల్లీలోనే ఉన్నట్లు సమాచారం.

విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా ఇలా..
గత కొన్ని రోజులుగా క్వారంటైన్ చేసిన విదేశీయులు సంఖ్య 25,937 ఉండగా వారిలో కేవలం 50 మందికి మాత్రమే వైరస్ సోకిందని అధికారులు వెల్లడించారు. వీరిలో 30 మంది విదేశాల నుంచి నేరుగా వచ్చిన వారు కాగా, వీళ్ల నుంచి 20 మంది కుటుంబ సభ్యులకు వైరస్ సోకిందని అధికారులు పేర్కొన్నారు. నేటితో(మంగళవారం) తొలి క్వారంటైన్ బ్యాచ్‌కి సమయం పూర్తవుతోందని, అందరికీ ఎలాంటి అనుమానిత లక్షణాలు రాలేదని అధికారులు తెలిపారు. వీళ్లల్లో 258 మంది మినహా అందరిని క్వారంటైన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఇచ్చామని అధికారులు చెప్పారు. ఈనెల 9 వరకు పూర్తిగా తొలి క్వారంటైన్ పూర్తవుతోందని అధికారులు ప్రకటించారు.

జిల్లాల్లో విస్తరిస్తున్న కరోనా..
రాష్ట్రంలో కరోనా వైరస్ జిల్లాలకూ విస్తరిస్తోంది. 33 జిల్లాల్లో 25 జిల్లాలకు ఇప్పటికే వైరస్ సోకిందని, దీనిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధి జిల్లాల్లోకే ఎక్కువ కేసులు ఉన్నట్లు బులిటెన్‌లో తెలిపారు. ఇక్కడ కూడా మర్కజ్‌లింక్ నుంచే సోకుతుందని అధికారులు చెబుతున్నారు. సోమవారం సూర్యాపేట జిల్లాలో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా ఆరుగురికి కరోనా సోకినట్లు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడి ్డతెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొనడం ద్వారా కరోనా బారిన పడినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో అతని బంధువులైన నాగారం మండలం వర్ధమానుకోటకు చెందిన ఆరుగురికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా కేసులు పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరుకుందని అధికారులు తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో తాజాగా మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం 41మంది రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించగా అందులో 20 మందికి సంబంధించిన రిపోర్టులు వచ్చాయన్నారు. ఈ రిపోర్టులో 10మందికి కరోనా సోకిందని వివరించారు. వారిలో 7గురు ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వారు కాగా, మిగిలిన ముగ్గురు పాజిటివ్ వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న వారు, వారి బంధువులు అని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 305 మందిని ప్రాథమికంగా, 293మందిని సెకండరీగా గుర్తించి వారందరికి క్వారంటైన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.

జిల్లాల వారీగా కేసులు..
ఆదిలాబాద్ 10, భద్రాద్రి 2, హైదరాబాద్ 133, జగిత్యాల 3, జనగాం 2, జయశంకర్ 1, జోగులాంబ 13, కామారెడ్డి 8, కరీంనగర్ 7, మహబూబాబాద్ 1, మహబూబ్‌నగర్ 6, మెదక్ 5, మేడ్చల్ 15, ములుగు 2, నాగర్ కర్నూల్ 2, నల్గొండ 13, నిర్మల్ 4, నిజామాబాద్ 26, పెద్దపల్లి 2, రంగారెడ్డి 10, సంగారెడ్డి 7, సిద్దపేట్ 1, సూర్యపేట్ 8, వికారాబాద్ 4,వరంగల్ అర్బన్ 23.

30 new corona cases in state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News