Tuesday, May 14, 2024

పొడిగించక పోతే బూడిదలో పోసిన పన్నీరే

- Advertisement -
- Advertisement -

 lockdown

 

లాక్‌డౌన్‌పై నిపుణుల నిశ్చితాభిప్రాయం
ఇప్పటి వరకు లభించిన సానుకూల ఫలితాలు వృథా అయిపోతాయి
కరోనా పరీక్షలను అనేక రెట్లు పెంచాల్సి ఉంది

న్యూఢిల్లీ: యావత్ భారత దేశం ప్రస్తుతం 21 రోజుల లాక్‌డౌన్‌తో కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తోంది. అయితే ఈ లాక్‌డౌన్ కారణంగా అన్ని వ్యవప్థలు స్తంభించి పోయి అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని స్థితికి జారుకుంటోంది. కాగా మూడు వారాల లాక్‌డౌన్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ఏ ప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారని అన్నివర్గాల ప్రజలు ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటే నిపుణులు మాత్రం దేశం కరోనా ప్రమాదంనుంచి పూర్తిగా బయట పడలేదని, అందువల్ల మరి కొన్ని రోజులు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు. 21 రోజుల లాక్‌డౌన్ వాస్తవ ప్రభావాన్ని అంచనా వేయడానికి భారీ ప్రమాణంలో కరోనా పరీక్షలు జరపాల్సిన అవసరం ఉందని కూడా వారంటున్నారు. లేని పక్షంలో లాక్‌డౌన్ సమయం లో చేసిన కృషి, లభించిన సానుకూల ఫలితాలు అంతా కూడా బూడిదలో పోసిన ప న్నీరవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని మందగించేలా చేయడానికి లాక్‌డౌన్ తోడ్పడిందని నిపుణులు అంగీకరిస్తున్నారు. అయితే పరిస్థితి పూర్తి గా అదుపులోకి రాలేదని, అందువల్ల సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అత్యవసరంగా వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందని వారంటున్నారు. లాక్‌డౌన్ పని చేయాలంటే కరోనా పరీక్షలు నిర్వహించడాన్ని అనేక రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ డైరెక్టర్, ఫెలో అయిన రమణన్ లక్ష్మీనారాయణ్ అన్నారు. భారత దేశం ఇప్పుడు కరోనా మూడో దశలో అంటే సమూహ వ్యాప్తిలో ఉందని సర్ గంగారాం ఆస్పత్రిలో ప్రముఖ ఊపిరితిత్తుల సర్జన్ అరవింద్ కుమార్ అన్నారు. సమూహ జనాభాలో కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించడానికి పూల్డ్ శాంప్లింగ్‌గా పిలవబడే పిసిఆర్ టెస్టింగ్ విధానాన్ని పాటించడం మంచిదన్నారు. పరీక్షల సంఖ్యను పెంచని పక్షంలో లాక్‌డౌన్ ప్రయోజనాలు నీరు గారిపోతాయని డాక్టర్ దాంగ్స్ ల్యాబ్స్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ దాంగ్ అన్నారు. పరీక్షల నిర్వహణను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉవదని,మరో 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచడానికి వీలవుతుందని ఐఎంఎ మాజీ అధ్యక్షుడు అగర్వాల్ అన్నారు.

 

It is better to continue with the lockdown
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News