Thursday, April 25, 2024

దేశ వ్యాప్తంగా గిరిజన బంధు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగా దేశ వ్యాప్తంగా గిరిజన బంధును అమలు చేయాలని లోక్‌సభలో బిఆర్‌ఎస్ పార్టీ సభా పక్షనాయకుడు నామా నాగేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా అన్నం దొరకక మరణిస్తున్న వారు ఉండడం శోఛనీయమని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి షెడ్యూల్ తెగలులో మరింత ఎక్కువ కనిపిస్తున్నదన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ సభపై ఉందన్నారు.షెడ్యూల్ తెగలు వారికీ సహకారం అందించి వారి ఎదుగుదలకు తోడ్పాటును అందించడం కేంద్రం ప్రధాన విధి అని అన్నారు. ఈ నేపథ్యంలోలో వారి ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటుగా వారి పిల్లలకు మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వారికీ సేవ రంగంలో సౌలభ్యం కలిపించే విధంగా చర్యలు తీసుకోవలిసిన భాద్యత లోక్‌సభ సభ్యులుగా మనందరిపై ఉందన్నారు.
బుధవారం లోక్‌సభలో రాజ్యాంగం (షెడ్యూల్ తెగలు) ఐదవ సవరణ బిల్లు (2022)పై జరిగిన చర్చ సందర్భంగా నామా మాట్లాడుతూ, భారత దేశంలో దళితుల అభ్యన్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఆలోచించిన విధంగా మరో ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం విచారకరమన్నారు. దళితుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పది లక్షల రూపాయలను ప్రొత్సాహంగా అందిస్తోందన్నారు. తద్వారా రాష్ట్రంలోని దళిత వర్గాల జీవన విధానంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయన్నారు. ప్రస్తుతం వారంతా నిజమైన పండుగు చేసుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా దేశ వ్యాప్తంగా గిరిజన బంధును అమలు చేయాలన్నారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నామా కోరారు. దేశంలో ని ఎస్‌సి, ఎస్‌టి, బిసిలందరూ కూడా నూతన పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతున్నారని తెలిపారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ఇప్పటికే నూతన సెక్రటేరియట్ కి అంబేద్కర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. షెడ్యూల్ ట్రైబల్‌లో చాలా మంది రోజంతా పని చేసినా కూడా భోజనం దొరకక ఆకలితో అలమటిస్తూ మరణించటం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని కేంద్రం చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసముందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఎస్టీల అభివృద్ధి కోసం బిల్ – 2017 తీసుకురావటం జరిగిందని, ఆ బిల్లు లో ఎస్‌టిల అభివృద్ధి కోసం వారి పిల్లల చదువులు కోసం, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. అలాగే దీనిపై సిఎం కెసిఆర్ పలు మార్లు కేంద్రానికి లేఖలు రాయడంతో పాటు ఉభయసభల్లోనూ మాట్లాడటం జరిగిందన్నారు. వీటితో పాటుగా సంబంధిత కేంద్ర మంత్రికి సైలం అనేకమార్లు విన్నవించటం జరిగిందన్నారు.కాని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి వుంటే షెడ్యూల్ తెగలు బాధలు తొలిగించాలనే ఆలోచన ఉంటే షెడ్యూల్ తెగల రిజర్వేషన్ బిల్లు సత్వరమే ఆమోదం తెలిపి చట్టం చేయాలి అని ఈ సందర్భంగా నామా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టి లకు తోడ్పాటు అందించాలన్నారు. అదే విధంగా షెడ్యూల్ కులాల్లో ఎ,బి,సి,డి వర్గీకరణ గురించి 2014 లో అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. దానిపై కూడానీ ఇప్పటి వరకు ఎటు వంటి పురోగతి లేదన్నారు.
కేంద్రం తీసుకు వచ్చిన 1/70 చట్టం క్రింద భూములు విషయంలో వారు ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయం చేసుకుంటున్న ట్రైబ్స్‌కు రిజిస్ట్రేషన్ చేసే విధంగా చట్ట సవరణ తీసుకురావాలని అన్నారు.

తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా భారత దేశ వ్యాప్తంగా ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు వారి పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ నామా డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News