Tuesday, April 30, 2024

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

- Advertisement -
- Advertisement -

love couple attempt suicide in hyderabad

హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతీ యువకుడు జవహర్ నగర్ లో రూం అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలోనే రూంలో ఇద్దరూ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా, ఫ్యాన్ కు ఉన్న చున్ని కిందపడటంతో యువతి క్షేమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి, గాయపడిన మహిళ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జూబ్లీ హిల్స్ సబ్ ఇన్స్పెక్టర్  పి.చంద్రశేఖర్ తెలిపారు.

love couple attempt suicide in hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News