Wednesday, May 8, 2024

మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

- Advertisement -
- Advertisement -
Low pressure in the Northwest Bay of Bengal
ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్: మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడిందని, దీనివలన రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టగా అల్పపీడనం నేపథ్యంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 48 గంటల్లో అది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా అల్పపీడనం ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News