Wednesday, May 1, 2024

రూపానీ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Vijay Rupani has resigned

గుజరాత్ ముఖ్యమంత్రి
పదవి నుంచి వైదొలిగిన విజయ్
ఎన్నికలకు ఏడాది ముందర ప్రధాని మోడీ
సొంత రాష్ట్రంలో అనూహ్య పరిణామం
రేసులో కేంద్రమంత్రి మాండవీయ, నితిన్ పటేల్?

అహ్మదాబాద్/న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం తమ పదవికి రాజీనామా చేశారు. ఈ అత్యంత నాటకీయ, అనుహ్య పరిణామం ప్రధాన నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు రాజీనామా పత్రం సమర్పించారు. గు జరాత్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అకస్మాత్తుగా విజయ్ రూపానీ ఎందుకు రాజీనామా చేశారనేది స్పష్టం కాలేదు. ఆయన రాజీనామాతో కేబినెట్ కూడా రద్దు అయింది. అ యితే అసెంబ్లీ ఎన్నికలకు బిజెపిని అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగంలో నిలిపేందుకు ఈ మార్పు జరిగిందని భావిస్తున్నారు. ‘ ఐదేళ్లుగా గుజరాత్ అభివృద్ధి క్రమం ప్రయాణంలో పాత్ర వహిస్తూ వ చ్చాను. నేత, ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో పనిచేశాను. ద్విగుణీకృత రూపానీ రాజీనామా శక్తి, మరింత బలంతో ముందకు సాగుతాను. ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను’ అని రూపానీ చెప్పినట్లు వారాత సంస్థలు తెలిపాయి. పార్టీగా బిజెపిలో అవసరాల మేరకు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయనేది విదితమే, ప్రతి ఒక్క కార్యకర్త తమ సేవలను పార్టీ పటిష్టతకు గరిష్టంగా వినియోగించేందుకు వీలుగా బిజెపి సంస్థాగతంగా ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది.

ఈ దిశలోనే తాను కూడా పదవి నుంచి వైదొలుగుతున్నట్లు, ఇప్పటి బలంతోనే ఇక ముందు కూడా పార్టీ పటిష్టతకు పాటుపడుతానని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలతో రూపానీ పార్టీ అధిష్టానం అధినాయకత్వం ఆదేశాలతో రాజీనామాకు దిగినట్లు స్పష్టం అయింది. ఇదే దశలో రూపానీ పార్టీ నిర్మాణాత్మక బాధ్యతలు పంచుకుంటారని వెల్లడైంది. అధికారంలో పటిష్ట రీతిలోనే ఉంటూ వచ్చిన బిజెపి ఉన్నట్లుండి సిఎం పీఠం నుంచి రూపానినీ ఎందుకు తప్పించిందనేది విదితం కాలేదు. ఇప్పుడు పార్టీ ముందు మూడు తక్షణం చేపట్టాల్సిన అంశాలు ఉన్నాయి. ఒకటి రూపానీ వారసుడు ఎవరనేది ఖరారు చేయడం, కొత్త కేబినెట్ రావడం, రెండు రాష్ట్రపతి పాలన విధించడం, లేదా నిర్ణీత గడువుకు ముందే అసెంబ్లీ ఎన్నికలకు సిఫార్సు చేయడం. అయితే ముందస్తు ఎన్నికలకు ఇప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం లేదని భావిస్తున్నారు. వెంటనే మరో నేతకు బాధ్యతలు అప్పగించే వీలుందని వెల్లడైంది. 2016 ఆగస్టు 7వ తేదీన రూపానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దాదాపుగా మరో 15 నెలల వరకూ ఆయన సిఎం పీఠంలో ఉండేందుకు వీలుంది.

మనుసుఖ్ లేదా పటేల్‌కు అవకాశం

రూపానీ స్థానంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుఖ్ మాండవీయ లేదా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నితిన్ పటేల్‌కు అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవలే అత్యంత ప్రధానమైన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బాధ్యతలు తీసుకున్న మాండవీయకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆయన భావ్‌నగర్‌లో జన్మించారు. గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన రూపాని నివాసానికి చేరుకుని సంప్రదింపులు సాగిస్తున్నారని వెల్లడైంది. రూపానీ పనితీరుపై పార్టీ అధినాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాలు తెలపియా. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బిజెపికి సరైన నాయకత్వం దిశలో అత్యవసర ఆపరేషన్ జరిగినట్లు భావిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వంపై అసమ్మతి ఉన్నా, పనితీరు బాగా లేకున్నా వెంటనే సర్దుబాట్లు చేయడం ఒకటే మందు అనే నిర్థారణకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటికే కర్నాటక, తరువాత ఉత్తరాఖండ్ ఇప్పుడు గుజరాత్‌లలో నాయకత్వ మార్పులు జరిగినట్లు స్పష్టం అయింది

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News