Sunday, April 28, 2024

ఈ ఘోరానికి రెండు దశాబ్దాలు

- Advertisement -
- Advertisement -

Today marks 20 years since the 9/11 carnage

 

న్యూఢిల్లీ : 2001 సెప్టెంబర్ 11న ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నేటితో 9/11 మరణహోమానికి 20 ఏళ్లు. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా పక్కా వ్యుహంతో జరిపిన ఉగ్రదాడి భయకంపితులను చేసింది. దాదాపు 3వేల మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో వేలాది మంది గాయపడ్డారు. అంతేకాకుండా ఆ సమీప ప్రాంతాలలోని ప్రజల ఆరోగ్యంపై ఈ ఉగ్రదాడి తీవ్ర ప్రభావం చూపింది. అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో అమెరికాలో నాలుగు చోట్ల విమానాలతో దాడి చేసేందుకు ప్రణాళికలు రచించారు. ప్లాన్ ప్రకారం 19 మంది ఉగ్రవాదులు నాలుగు జట్లుగా విడిపోయి మొత్తం నాలుగు విమానాలను హైజాక్ చేశారు. మొదట ఓ విమానంతో ఉదయం 8.46కు నార్త్ టవర్‌ను ఢీకొనగా, రెండో విమానం ఉదయం 9.03 నిమిషాలకు సౌత్ టవర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు, దట్టమైన పొగ, ఆర్తనాదాలు ఆ ప్రాంతం మొత్తం జనాల ఆర్తనాదాలతో నిండిపోయింది.

ఆ ప్రాంతంలో కొన్నిచోట్ల వందల డిగ్రీల ఉష్ణం చోటుచేసుకుంది. చాలా మంది ఆ మంటల్లో కాలిపోయారు. కొందరు ఏం చేయాలో తెలియక పై నుంచి దూకేశారు. ఈ ఉగ్రదాడి నుంచి జనాలను రక్షించేందుకు యత్నించిన పలువురు అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మూడో విమానం అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9.37 నిమిషాలకు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ పశ్చిమం వైపు భాగాన్ని ధ్వంసం చేసింది. నాలుగో విమానం ఉదయం 10.03 నిమిషాలకు పెన్సిల్వేనియాలో కూలిపోయింది. ఇక, ట్విన్ టవర్స్‌పై దాడి జరిగిన సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఫ్లోరిడాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమానికి హాజరయ్యారు. బుష్ పిల్లలతో ముచ్చటిస్తున్న సమయంలో అప్పటి వైట్ హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రూ కార్డ్ బుష్ చెవిలో చెప్పారు. అయితే అక్కడ పిల్లలు ఆందోళన చెందకుడదనే ఉద్దేశంతో సమయం పాటించని.. వీలైనంత త్వరగా ఆ కార్యక్రమాన్ని ముగించిన అక్కడి నుంచి బయటకు వచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News