Monday, May 6, 2024

యష్ ‘లక్కీ స్టార్’ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

కె.జి.ఎఫ్ -1, కె.జి.ఎఫ్ -2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్టార్ హీరో యష్ నటించగా… కన్నడలో ఘన విజయం సాధించిన ‘లక్కీ’ అనే చిత్రం తెలుగులో ‘లక్కీ స్టార్’గా రానుంది. కన్నడలో ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నటి రాధికా కుమార్ స్వామి స్వయంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘లక్కీ స్టార్’ చిత్రాన్ని తీసుకువస్తున్నారు. రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. డా.సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ సరసన టాప్ హీరోయిన్ రమ్య నటించింది. లవ్, -కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ‘లక్కీ స్టార్’ ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ రిలీజ్ చేసి… కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రవిరాజ్, ఈ చిత్రానికి సాహిత్యం సమకూర్చిన గురు చరణ్, సంభాషణల రచయిత సూర్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేశవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రవిరాజ్ మాట్లాడుతూ… “తెలుగులోనూ స్ట్రెయిట్‌గా సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అందుకే ఈ చిత్రానికి చాలా ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చినా… మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం”అని తెలిపారు.

‘Lucky Star’ Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News