Sunday, April 28, 2024

పాలమూరులో పైచేయి ఎవరిది?

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ ఇన్‌చార్జిగా
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఓటర్లు 14 లక్షల
18వేల 672 మంది

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో పాలమూరు స్థానం సర్వత్రా ఆసక్తిరేపనున్నది. ఇక్కడ ఇద్దరు జాతీయ పార్టీల నాయకులు ఉండగా, మరొకరు సిట్టింగ్ ఎంపికే మళ్లీ టికెట్ ఇవ్వడం.. వీరిలో బిజెపి నుంచి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, కాంగ్రెస్ నుంచి సిడబ్లుసి ప్రత్యేక అహ్వానితు డు, మాజీ ఎంఎల్‌ఎ, రాహుల్ గాంధీకి అత్యం త సన్నిహితుడు చల్లా వంశీచందర్ రెడ్డి, బిఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. ముగ్గురికి ముగ్గురు గత 2019 ఎన్నికల్లో బరిలోకి దిగినవారే. ఈసారి కూడా ఆ ముగ్గురే పోటీలో ఉన్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభలో 14 లక్షల 18 వేల 672 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఆయనే పాలమూరు లోక్‌సభ ఎన్నికను ఇన్‌చార్జిగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక ఆయనకు సవాల్‌గా మారనుంది. మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్‌నగర్, మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల అన్నింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సిఎంతో పాటు ఏడుగురు ఎంఎల్‌ఎలు అందరూ ఎన్నికను సవాల్‌గా తీసుకోనున్నారు. ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డి ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ వచ్చేలా చూడాలని ఎమ్మెల్యేలందరికీ సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పాలమూరుకు ఆ యన వరాల జల్లు కురిపించా రు. పాలమూరు అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని ప్రకటించారు.

జితేందర్ రెడ్డికి పదవితో…

బిజెపి నుంచి పాలమూరు లోక్‌సభకు పోటీ చేయాలనుకున్న మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి టికెట్ డికె అరుణకు దక్కడంతో తీవ్ర అసంతృప్తి చెందారు. ఈ విషయాన్ని గమనించిన సిఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహానికి పదును పెట్టారు. స్వయంగా జితేందర్ రెడ్డికి ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డికి ఢిల్లీల్లో ప్రభుత్వ ప్రత్యేక రాష్ట్ర అధికార ప్రతినిధిగా కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు.

జితేందర్ రెడ్డి చేరికతో జిల్లాలో బిజెపికి పెద్ద షాక్ తగిలింది. నియోజక వ ర్గ పరిధిలో ఆయన అనుచరవర్గం, ఓటు బ్యా క్ పెద్ద ఎత్తున ఉంది. ఆయన రెండుసార్లు ఎంపిగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లోకి రావడంతో ఆ పార్టీకి కలిసివస్తుం దని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక బిజెపిలో టికెట్ ఆశించి బంగపడిన బిసి నేత శాంతికుమార్ కూడా డికె అరుణ పట్ల అంత సానుకూలతగా లేనట్లు తెలుస్తోంది. డికె అరుణ ప్రధాని నరేంద్ర మోడీపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఆయనకు దేశంలో ఉన్న జనాకర్షణ తనకు కలిసివస్తుందని విశ్వసిస్తున్నా రు.

ఇక 2109లో జరిగిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన మన్నె జీవన్ రెడ్డికి 4,11,402 ఓట్లు అంటే 41.78 శాతం ఓట్లు సాధించగా, బిజెపి నుంచి పోటీ చేసిన డికె అరుణకు 3,33,573 ఓట్లు 33.88 శాతం ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వంశీచందర్ రెడ్డికి 1,93, 631 ఓట్లు, 19.67 శాతం ఓట్లు నమోదయ్యాయి. అప్ప ట్లో బిఆర్‌ఎస్ అభ్యర్థ్ధి కంటే 77,829 ఓట్లు తక్కువతో అరుణ ఓడిపోయారు. గత ఎన్నికల్లో జితేందర్ రెడ్డి, శాంతికుమార్ బిజెపిలోనే ఉన్నారు. ఈ సారి వారిలో ఒక రు కాంగ్రెస్‌లో చేరగా, మరొకరు అసంతృప్తిగా ఉన్నారు.

సంవత్సరం గెలిచిన పార్టీ అభ్యర్థి
1952 కాంగ్రెస్ జనార్దన్ రెడ్డి
1957 కాంగ్రెస్ రామేశ్వర్‌రావు
1962 కాంగ్రెస్ ముత్యాల రావు
1967 కాంగ్రెస్ రామేశ్వర్ రావు
1971 తెలంగాణ ప్రజా సమితి రామేశ్వర్‌రావు
1977 కాంగ్రెస్ రామేశ్వర్‌రావు
1980 కాంగ్రెస్ మల్లికార్జున గౌడ్
1984 జనతా పార్టీ జైపాల్ రెడ్డి
1989 కాంగ్రెస్ మల్లికార్జున గౌడ్
1991 కాంగ్రెస్ మల్లికార్జున గౌడ్
1996 కాంగ్రెస్ మల్లికార్జున గౌడ్
1998 జనతాదళ్ జైపాల్ రెడ్డి
1999 బిజెపి ఎపి జితేందర్ రెడ్డి
2004 కాంగ్రెస్ విఠల్‌రావు
2009 టిఆర్‌ఎస్ కెసిఆర్
2014 టిఆర్‌ఎస్ ఎపి జితేందర్ రెడ్డి
2019 టిఆర్‌ఎస్ మన్నె జీవన్ రెడ్డి.

బి.జి.రామాంజనేయులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News