Friday, May 3, 2024

ఆ నీటి వాడకం వల్లే బ్లాక్ ఫంగస్?!

- Advertisement -
- Advertisement -

Main cause of spread of Black Fungus is humidifier used for Oxygen

 

న్యూఢిల్లీ : కొవిడ్ నుంచి కోలుకున్న వారిని ఇప్పుడు బెంబేలెత్తిస్తున్నది బ్లాక్ ఫంగస్(మ్యూకర్‌మైకోసిస్). చికిత్స సమయంలో బాధితులకు అత్యంత అవసరం ఆక్సిజన్. ఈ ఆక్సిజన్‌ను హ్యూమిడిఫయ్యర్ల(తేమ అందించే పరికరం) ద్వారా అందిస్తారు. సాధారణంగా ఆక్సిజన్ హ్యూమిడిఫయర్లలో స్టెరైల్ వాటర్ నింపాలి. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో, ఇళ్లలో చికిత్స తీసుకుంటున్న అనేకమంది ఈ హ్యుమిడిఫయర్లలో సాధారణ నీటిని వాడుతున్నారని తెలుస్తోంది. ఇలా వాడడం వల్ల ఆ నీటిలో ఉన్న సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి అనేక హానికారక జీవులు నేరుగా శ్వాసకోశంలోకి చేరే ప్రమాదం ఉంది. తద్వారా బ్లాక్ ఫంగస్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్ హృద్రోగ చికిత్స నిపుణులు డాక్టర్ అతుల్ అభ్యంకర్ దీనిపై స్పందించారు.

బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి ప్రధాన కారణం ఆక్సిజన్‌కు ఉపయోగించే హ్యుమిడిఫయర్లేనని, వాటిలో స్టెరైల్ నీటినే ఉపయోగించాలని చెప్పారు. అయితే ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న బాధిుతులు ఈ హ్యూమిడిఫయర్లలో సాధారణ నల్లా నీటినే వినియోగిస్తున్నారని, దీనివల్ల అందులో ఉండే రకరకాల సూక్ష్మజీవులు శరీరంలోకి చేరి ఫంగస్ ఏర్పడుతోందని అతుల్ వెల్లడించారు. హ్యుమిడిఫయర్లలో స్టెరైల్ నీటినే వినియోగించాలని, 24 గంటల్లో రెండుసార్లు నీటని మార్చాలని సూచించారు. ఎప్పటికప్పుడు హ్యుమిడిఫయర్‌ను శుభ్రం చేస్తుండాలన్నారు. అప్పుడే సూక్ష్మజీవులు, బాక్టీరియాలు, ఫంగస్‌ల నుంచి రక్షణ పొందగలుగుతామని అతుల్ అభ్యంకర్ సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News