Sunday, April 28, 2024

దేశాల బృందంతో తుపాన్ల పేర్లు

- Advertisement -
- Advertisement -

Cyclone Tauktae derives its name from Myanmar

 

ముంబై : అరేబియా సముద్రంలో తలెత్తిన అల్పపీడనం చివరికి తుపాన్‌గా మారి ప్రభావం చూపుతోంది. దీనికి తౌక్టే అనే పేరు పెట్టారు. తుపాన్‌లకు 13 దేశాలతో కలిసి ఏర్పడ్డ ప్యానెల్ పేర్లు పెడుతుంది. ప్రపంచవాతావరణ సంస్థ (డబ్లుఎంఒ), ఐరాస ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ది పసిఫిక్ ( ఇఎస్‌సిఎపి) , ప్యానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ (పిటిసి) కలిసి బృందంగా ఏర్పడి పేర్లు పెడుతాయి. ఈ ప్యానెల్‌లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్థాన్, శ్రీలంక వంటి 13 దేశాలు ఉంటాయి. 2004లో ఈ బృందంలో ఎనిమిది దేశాలు సభ్యులుగా ఉండేవి.

అప్పుడు ఈ ప్యానెల్ 64 పేర్లను ఖరారు చేసిపెట్టింది. ఒక్కోదేశానికి ఎనిమిది పేర్లను ఎంపిక చేసి ఉంచారు. ఈ జాబితాలో ఇండియాకు గత ఏడాది తాకిన అంఫాన్ చివరి తుపాన్. నిసర్గ పేరిట వచ్చిన మరో తుపాన్ తాజా జాబితాలో మొదటి పేరు. బంగ్లాదేశ్ నుంచి వెలువడ్డ పేరు ఇది. 2018లో ప్యానెల్‌లోకి మరో ఐదు దేశాలను చేర్చారు. గత ఏడాది ఈ కొత్త ప్యానెల్ 169 తుపాన్లకు పేర్లు పెట్టి ఉంచాయి. ఇప్పుడు ఉన్న 13 దేశాల నుంచి 13 పేర్లు చొప్పున వీటిని ఖరారు చేశారు.

తౌక్టే మయన్మార్ తొండపేరు

ఇప్పుడు అరేబియా సముద్రం నుంచి తలెత్తి భారత్‌లో నష్టం కల్గిస్తోన్న ప్రస్తుత తుపాన్ తౌక్టే పేరు మయన్మార్ నుంచి వెలువడింది. మయన్మార్‌లో గొంతుచించుకుని బాగా అరిచే జెకో అనే తొండకు స్థానికంగా తౌక్టే అనే పేరుంది. దీని చప్పుడును తుపాన్ వేగపు క్రమంలో శబ్దాలతో పోలుస్తూ దీనికి సిద్ధంగా ఉంచిన పేరు తగిలించారు. గతంలో ఇండియాకు తాకిన అంఫాన్ తుపాన్‌లోని అంఫాన్ అంటే ఆకాశం అనే అర్థం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News