Monday, May 6, 2024

భారతీయులే టార్గెట్.. ఇక వీసా లేకుండానే మలేషియాకు..

- Advertisement -
- Advertisement -

పర్యాటకంతో దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకునేందుకు పలు దేశాలు.. పర్యాటకులకు సులభవతర, ఆకట్టుకునే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలో మలేషియా కూడా చేరింది. తమ దేశంలో పర్యటించేందుకు వచ్చే ఇతర దేశాల పర్యాటకులకు మలేషియా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే తమ దేశాన్ని సందర్శించేందుకు అనుమతిస్తూ మలేషియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పెట్టుబడుల్ని, పర్యటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వీసా లేకుండా 30 రోజులు మలేషియాలో పర్యటించేందుకు అనుమతించింది. ఈ ఉచిత వీసా విధానం డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. భారత్ తోపాటు చైనా పర్యాటకులకు కూడా మలేషియా ఈ సౌకర్యాన్ని కల్పించింది. కాగా, ఇప్పటికే థాయిలాండ్, శ్రీలంక దేశాలు.. భారతీయులకు ఉచిత వీసా సర్వీస్ ను కల్పించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News