Wednesday, November 30, 2022

ఐటి దాడులు నాకు కొత్తేం కాదు: మంత్రి మల్లారెడ్డి

- Advertisement -

 

హైదరాబాద్: ఐటి దాడులు తనకు కొత్త కాదని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటి దాడులు తనకు కొత్త కాదని గతంలో రెండు దఫాలు జరగాయని వివరించారు. అంతా చట్టబద్ధమైన వ్యాపారం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ కు భయపడి బిజెపి పథకం ప్రకారం టిఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనకు అండగా ఉన్నారన్నారు. సమావేశం అనంతరం విదేశాల నుంచి తిరిగి వచ్చిన తన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని కలవడానికి బోయినపల్లి సౌజన్య కాలనీలోని ఆయన నివాసానికి మల్లారెడ్డి వెళ్లారు. అక్రమాలు, దౌర్జన్యం తనకు అలవాటు లేదన్నారు. ఇంజినీరింగ్ వ్యవస్థ అంటేనే మల్లారెడ్డి గుర్తు వచ్చేలా తీర్చి దిద్దామన్నారు. బిజెపి నేతలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles