Sunday, April 28, 2024

ఉద్యోగం లేదనుకుంటే వజ్రం చిక్కింది !

- Advertisement -
- Advertisement -
Man Finds Diamond Worth Rs 30 Lakh in Madhya Pradesh
రాత్రికిరాత్రే లక్షాధికారిగా మారిన నిరుద్యోగి

పన్నా(మధ్యప్రదేశ్): లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగ నియామకం వాయిదాపడడంతో ఒక గనిని లీజుకు తీసుకున్న ఓ 24 ఏళ్ల యువకుడు రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు. దాదాపు రూ. 30 లక్షల విలువైన 6.92 క్యారెట్ల వజ్రం చిక్కడంతో సందీప్ యాదవ్ అనే యువకుడి పంట పండింది. కరోనా వైరస్ కారణంగా పోలీసు నియామకాలు వాయిదాపడడంతో మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా కృష్ణ కళ్యాణ్‌పూర్ ప్రాంతంలో ఒక గనిని ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నాడు. బుధవారం గనిలో తవ్వకాలు జరుపుతుండగా యాదవ్‌కు ఒక వజ్రం దొరికింది.

మార్కెట్‌లో దీని విలువ రూ. 30 లక్షలు ఉంటుందని స్థానిక వజ్రాల వ్యాపారి అనుపమ్ సింగ్ తెలిపారు. అత్యంత వెనుకబడిన బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని పన్నా జిల్లా వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది. గత నెలరోజుల్లో వజ్రాలతో జాక్‌పాట్ కొట్టిన వారిలో యాదవ్ నాలుగవ వ్యక్తి. ఈ వజ్రాన్ని వేలం నిమిత్తం స్థానిక వజ్రాల కేంద్రంలో ఉంచినట్లు యాదవ్ తెలిపారు. వజ్రానికి వేలం అమ్మకం ద్వారా వచ్చే మొత్తంలో 2.5 శాతం రాయల్టీని మినహాయించుకుని మిగిలిన డబ్బును యాదవ్‌కే అందచేస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Man Finds Diamond Worth Rs 30 Lakh in Madhya Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News