Friday, May 10, 2024

పుతిన్ రాజీనామా యోచన?

- Advertisement -
- Advertisement -

Is Vladimir Putin planning to resign?

 

మాస్కో : రష్యాలో దాదాపు రెండు దశాబ్దాలుగా పాలన సాగించిన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అరుదైన పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా వచ్చే జనవరిలో ఆయన పదవి నుంచి వైదొలగనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. పుతిన్ మాజీ జిమ్నాస్ట్ లవర్ అలినా కబేవా ఆయనను అధికార బాధ్యతల నుంచి దూరం జరగాలని కోరుతున్నట్టు ‘ది సన్’ కథనం పేర్కొంది. ఇటీవల విడుదలైన ఓ వీడియోలో పుతిన్ తరచూ తన కాలు అటూ ఇటూ కదుపుతున్నట్టు కనిపించింది. దీంతో విపరీతమైన నొప్పి కారణంగానే ఆయన కాలు కదుపుతున్నట్టు నిపుణులు పేర్కొన్నట్టు ది సన్ పేర్కొంది. ఈ వీడియోపై రకరకాల చర్చలు కొనసాగుతుండగానే పుతిన్‌కు పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు ఉన్నాయంటూ మాస్కో పొలిటికల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ వాలెరీ సోలోవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలో పుతిన్ ఇప్పటి వరకు దాదాపు 20 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగారు. 2012 నుంచి ఆయన రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతుండగా… అంతకు ముందు ఆయన 1999 నుంచి 2008 వరకు కూడా ఇదే పదవిలో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News