Sunday, April 28, 2024

మహిళ విషయంలో గొడవ.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

man murdered in shiva reddy sweet shop at SR Nagar

హైదరాబాద్: నగరంలో బుధవారం దారుణం చోటుచేసుంది. ఓ మహిళ విషయంలో ఇద్దరు వర్కర్ల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసింది. ఈ సంఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని శివారెడ్డి స్వీట్ షాపులో చోటుచేసుకుంది. శివారెడ్డి స్వీట్ షాపులో పని చేస్తున్న శ్రీనివాస్ ను మరో వర్కర్ హత్య చేశాడు. నిందితుడు గౌస్ మృతుడి తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు శ్రీనివాస్ స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News