Tuesday, May 21, 2024

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి….

- Advertisement -
- Advertisement -

Man secret watching neighbour's washroom

 

అహ్మదాబాద్: ఓ మహిళ స్నానం చేస్తుండగా వ్యక్తి సీక్రెట్‌గా చూసిన సంఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వడోదరలోని దోభోయ్ రోడ్డులో రాహుల్ పార్మర్ అనే వ్యక్తి ఉన్నాడు. పక్కింటి మహిళపై అతడి కన్ను పడింది. ఆమె స్నానం చేస్తుండగా పలుమార్లు తన కిటికీలో నుంచి ఆమెను చూస్తుండగా పక్కింట్లో ఆమె చెల్లెలు గుర్తించి అక్కకు చెప్పింది. అక్క చెల్లెలు కలిసి అతడిని హెచ్చరించారు. అతడు బుద్ధి మారకపోగా మళ్లీ ఆమె స్నానానికి వెళ్లినప్పుడు కిటికీలో నుంచి చూస్తున్నప్పుడు ఆమె చెల్లెలు చూసింది. అతడితో వాళ్లిద్దరు గొడవకు దిగారు. రోజు రోజుకు అతడి ప్రవర్తన హద్దు మీరడంతో అభయామ్ 181కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాహుల్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి ఫోన్‌ను పరిశీలించాగా అందులో వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే వీడియోలను డిలీట్ చేసి రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News