Tuesday, April 30, 2024

షూటింగ్‌లకు అనుమతి.. తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇటీవల సినిమా షూటింగ్స్ కు అనుమతి ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన టాలీవుడ్ ప్రములు మంత్రి తలసాని, సిఎం కెసిఆర్ తో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేస్తూ మంగళారం జీవో విడుదల చేసింది. ఇందులో భాగంగా మొదటి దశలో పోస్ట్‌ప్రొడక్షన్స్‌కు అనుమతినిచ్చిన ప్రభుత్వం.. లాక్ డౌన్‌తో మధ్యలో ఆగిన సినిమా, సీరియల్స్‌  షూటింగ్‌లకు అనుమతి ఇచ్చింది. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగ్‌లకు చేసుకోవచ్చని తెలిపింది. మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి ఉండాలని, షూటింగ్‌ల్లో తప్పనిసరిగా డాక్టర్లు ఉండాలని పేర్కొంది. ఎంట్రీ, ఎగ్జీట్‌తోపాటు కామన్ ఏరియాల్లో.. హ్యాండ్ వాష్, గ్లౌవ్స్, శానిటైజర్స్, సోప్ తప్పనిసరిగా ఉండాలని.. షూటింగ్ ఏరియాల్లో స్మోకింగ్, పాన్ బ్యాన్ చేసింది. స్టూడియోల్లోకి విజిటర్లకు అనుమతించవద్దని, ప్రతి ఒక్కరి నుంచి మెడికల్ డిక్లరేషన్ తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

TS Govt Permission to Movie and Serial Shooting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News