Thursday, May 16, 2024

ప్రేమ…. దళిత యువకుడిపై కత్తితో దాడి…

- Advertisement -
- Advertisement -

lovers brother attack on Dalit young man

 

కొచ్చి: 20 ఏళ్ల దళిత యువకుడు మాస్క్ కొనడానికి బయటకు వచ్చినప్పుడు అతడిపై లవర్ సోదరుడు కత్తులతో దాడి చేసిన సంఘటన కేరళలోని కొచ్చి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మువాత్తు పూఝా గ్రామానికి చెందిన దళిత యువకుడితో ఓ అమ్మాయి ప్రేమలో పడింది. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అతడితో ప్రేమ వ్యవహారం వద్దు అని ఆమెను హెచ్చరించారు. ఆమె మాత్రం అతడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. యువతి సోదరుడు తన స్నేహితుడితో కలిసి దళిత యువకుడు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. దళిత యువకుడు మాస్క్ కోసం షాపుకు వెళ్తుండగా యువతి సోదరుడు కత్తితో అతడి చేతి, మెడ, తలపై దాడి చేశాడు. వెంటనే అతడిని కొట్టాయమ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులపై ఐపిసి 307, ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News