Friday, May 3, 2024

భార్య కోసం బస్సెత్తుకెళ్లాడు

- Advertisement -
- Advertisement -

Man steals bus to meet wife in Kerala

 

లాక్‌డౌన్‌లో కోజికోడ్ మొనగాడు

న్యూఢిల్లీ : లాక్‌డౌన్… కదలని బస్సులు, దూర ప్రాంతంలో కట్టుకున్న భార్య. దిక్కుతోచని స్థితిలో ఆవిడను చూసేందుకు ఓ వ్యక్తి ఏకంగా ఓ ప్రైవేటు బస్సునే అపహరించుకుని వెళ్లాడు. అచ్చం సినిమా ఫక్కీలో ఈ ఘటన జరిగింది. నాలుగు జిల్లాలు దాటి, ఈ బస్సులో ప్రయాణించాడు. మధ్యలో ఆపిన పోలీసు వాళ్లను తమ మాటలతో కంగుతిన్పించాడు. లాక్‌డౌన్‌తో అక్కడక్కడ చిక్కుపడ్డ వలసకూలీలను తీసుకువెళ్లేందుకు వెళ్లుతున్నానని నమ్మబలికాడు. 30 ఏళ్ల దినూప్ భార్య కేరళలోని తిరువల్లలో ఉంది. దినూప్ కొజికోడ్‌లో ఉంటున్నాడు. వీరి కలయికకు భారీ అడ్డుగోడగా లాక్‌డౌన్ నిలిచింది. దీనితో ఏం చేయాలో తెలియక కొజికోడ్ బస్సుస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సు కన్పించింది. లోపల ఎవరూ లేరు. దీనితో అటూ ఇటూ చూసి ఈ ప్రైవేటు బస్సును కాజేసీ ఉడాయించాడు.

రెండు చోట్ల పోలీసులు బస్సును ఆపివేశారు. ఎక్కడి నుంచిఎక్కడకు? అనే ప్రశ్నలతో నిలదీశారు. మలాప్పురం, త్రిస్సూర్, ఎర్నాకులం , కొట్టాయం జిల్లాల మీదుగా దూసుకువెళ్లుతున్న దశలో తనను నిలిపివేసిన వారికి టక్కున సమాధానాలు ఇచ్చారు. వలసకూలీలను తీసుకువెళ్లే పనిలో ఉన్నానని, దారి వదిలిపెట్టండని చెప్పడంతో ఆయనకు అంతా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక కుమారకోమ్ వద్ద ఆయనను పోలీసులు ఆపివేసి , డ్రైవింగ్ లైసెన్సులు ఇతర పత్రాలు డిమాండ్ చేయడంతో చోరీ బస్సుతో వెళ్లుతున్నట్లు గుర్తించారు.

బస్సు యజమాని వివరాలను రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా కనుగొని ఆరా తీయగా, బస్సుస్టాండ్‌లో పార్క్ చేసిన తన బస్సు కన్పించడం లేదని, ఈ బస్సు తనదే అని చెప్పడంతో ఈ బస్సును ఆయన ఎత్తుకువెళ్లినట్లు నిర్థారణ అయింది. ఈ క్రమంలో విచారించగా లాక్‌డౌన్‌తో ప్రయాణ ఏర్పాట్లు లేకపోవడం వల్ల , భార్య దగ్గరికి వెళ్లేందుకు బస్సును తీసుకుని వెళ్లినట్లు తెలిపాడు. పోలీసులు ఈ వాదనను కొద్ది సేపు నమ్మారు. అయితే ఇంతకు ముందు కూడా ఆయన వాహనాలను దొంగిలించినట్లు పోలీసు రికార్డులలో ఉందని తేలడంతో ఇప్పటి ఘటనను ఈ క్రమంలో నిర్థారించుకునేందుకు సిద్ధం అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News