Wednesday, October 9, 2024

ఇండియా డి జట్టుపై ఇండియా సి జట్టు గెలుపు

- Advertisement -
- Advertisement -

అనంతపూర్: రూరల్ డవలపమెంట్ ట్రస్ట్ స్టేడియంలో దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా డి జట్టుపై ఇండియా సి జట్టు ఘన విజయం సాధించింది. ఇండియా డి జట్టుపై ఇండియా సి జట్టు నాలుగు
వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇండియా సి జట్టు 61 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేయడంతో విజయ దుదుంభి మోగించింది. రుతురాజ్ గాక్వాడ్(46), అర్యన్ జయాల్(47), రజత్ పాటీదర్(44), అభిషేక్ పోరెల్(35 నాటౌట్), సాయి సుదర్శన్ (22), మానవ్ సుథార్ (19 నాటౌట్) పరుగులు చేసి విజయం కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెటు, రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసి మానవ సుథార్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇండియా జట్టు బౌలర్లలో సరన్ష్ జోసి నాలుగు వికెట్లు తీయగా అర్షదీప్ సింగ్, అక్షర పటేల్ చెరో ఒక వికెట్ తీశారు.

ఇండియా డి తొలి ఇన్నింగ్స్: 164 ఆలౌట్
ఇండియా సి తొలి ఇన్నింగ్స్: 168 ఆలౌట్
ఇండియా డి సెకండ ఇన్నింగ్స్: 236 ఆలౌట్
ఇండియా సి సెకండ్ ఇన్నింగ్స్: 233/6

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News