హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’ రాకింగ్ స్టార్ మనోజ్ మంచు తన పాత్రలను, స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. తన తాజా ప్రాజెక్ట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహించగా, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోతుకూరి భరత్, నల్లగంగుళ వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. డేవిడ్ రెడ్డి అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా కథ 1897 నుంచి 1922 వరకూ నడుస్తుంది. ఈ స్టోరీలో మనోజ్ ఎన్నడూ చూడని పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. కుల వ్యవస్థ ఒత్తిడుల నుంచి తిరగబడి, బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన ఓ రెబల్ కథ ఇది. 21 సంవత్సరాల క్రితం, ఇదే రోజున మంచు మనోజ్ దొంగ దొంగది సినిమాతో అరంగేట్రం చేశారు. ఇప్పుడు సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత, తన కొత్త బ్లాస్టింగ్ వెంచర్ డేవిడ్ రెడ్డిని ప్రకటించడం విశేషం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ ఇస్తుంది. ‘మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టాడు, ఢిల్లీలో పెరిగాడు, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికిస్తున్నాడు!’ అనే ట్యాగ్‌లైన్ కట్టిపడేసింది. విజువల్‌గా అద్భుతమైన పోస్టర్ సినిమా ఎంత పవర్‌ఫుల్‌గా వుంటుందో తెలియజేస్తోంది.
హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ‘డేవిడ్ రెడ్డి’
- Advertisement -
- Advertisement -
- Advertisement -