కొత్తగూడెం : కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో రైల్వేశాఖ, కొత్తగూడెం (భద్రాచలం రోడ్డు) రైల్వే స్టేషన్ నుంచి నడిచే ఆరు రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికుల కష్టాలను తీర్చేందుకు రైల్వే బోర్డు ఆదేశాల మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఈ నెల 28 నుంచి ఓ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను పునరుద్ధరించనున్నారు. మణుగూరు నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే ఈ ప్రత్యేక రైలు (ట్రైన్ నెం. 02745) 28న సికింద్రాబాద్‌లో రాత్రి 11 గంటల 45 నిమిషాలకు బయల్దేరుతుంది. మణుగూరు నుంచి (ట్రైన్.నెం. 02746) 29న రాత్రి 10 గంటల 25 నిమిషాలకు సికింద్రాబాద్‌కు బయల్దేరనుంది. ఈ రైలు భద్రాచలం (కొత్తగూడెం) రోడ్, కారేపల్లి, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగామ స్టేషన్లలో ఆగనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ప్యాసింజర్ ట్రాఫిక్ మేనేజర్ శుక్రవారం విడుదల చేసిన సర్క్యూలర్‌లో పేర్కొన్నారు.