Saturday, September 20, 2025

మావోయిస్టు పార్టీలో ముసలం!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీలో ఇ ద్దరు అగ్రనేతల భిన్నాభిప్రాయాల తో ఆ పార్టీలో ముసలం పుట్టింది. అగ్రనేతల ప్రకటనలు మావోయిస్టు పార్టీలో భవిష్యత్‌లో చీలికకు దారి తీస్తుందాన న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో ఇప్పటికే అంతర్గత విభేదాలు నెలకొన్నాయా? అనే అనుమానాలకు వారి భిన్నాభిప్రాయాలు బలం చేకూర్చేలా ఉన్నాయి. పార్టీలో అగ్రనేతలు ఇటీవల పోలీసులకు లొంగిపోవడం, పార్టీలో అంతర్గత విభేదాలు మావోయిస్టు పార్టీని కుదిపేస్తున్నాయి. పార్టీ కేంద్ర క మిటీ సభ్యుడు సోనూ అలియాస్ అభయ్ పేరుతో ఇటీవల విడుదల చేసిన ప్ర కటనలో సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ఇస్తోన్నట్టు పేర్కొన్నారు. అయితే అభయ్ ప్రకటనతో మరో అగ్రనేత, పార్టీ అధికార ప్రతినిధి అయిన జగన్ విభేస్తూ, అది సోనూ (అభయ్) వ్యక్తిగత అభిప్రాయమే గాని, పార్టీ ని ర్ణయం కాదని స్పష్టం చేస్తూ మరో ప్రకటన విడుదల చేసారు. ఈ ప్రకటన పా ర్టీ నిర్ణయం కాదని కూడా జగన్ పేర్కొన్నారు. ఈ ఇరువురి ప్రకటనలతో మా వోయిస్టు పార్టీలో అంతర్గతంగా ఇప్పటికే  చీలిక వచ్చిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు మావోయిస్టు పార్టీని 2026 మార్చి నాటికి సమూలంగా నిర్మూలిస్తామని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. మావోయిస్టు పార్టీలో అంతర్గతంగా తలెత్తిన విభేదాలను కేంద్రం తనకు అనుకూలంగా మలుచుకుంటూ భారీ ఎన్‌కౌంటర్లకు పాల్పడుతుందా? అనే అనుమానాలకు కూడా దారితీస్తోంది. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయట పడేందుకే మావోయిస్టు పార్టీ తాత్కాలికంగా సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించడాన్ని ఒక ఎత్తుగడగా ఎంచుకుందా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతుండగా, అలాంటిదేమి లేదని మరో అగ్రనేత చెప్పడంతో మావోయిస్టు పార్టీలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది.సాయుధ పోరాట విరమణ అనేది పార్టీ నిర్ణయం కాదని, ఇది విప్లవ ఉద్యమానికి తీవ్ర నష్టం కలిగించేలా ఉందని అధికార ప్రతినిధి జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. పార్టీ అగ్రనేతలను మట్టుబెట్టడమే లక్షంగా కేంద్ర ప్రభుత్వం సాగిస్తోన్న యుద్ధ దాడుల వంటి ఈ క్లిష్ట సమయంలో పార్టీ అగ్రనేతల మధ్య పొడచూపిన భిన్నాభిప్రాయాలకు, అలాగే అంతర్గత విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయనడానికి నిదర్శనమని విశ్లేషిస్తున్నారు.

ఒకవైపు ఆపరేషన్ ’కగార్’ పేరుతో నక్సల్స్ ఏరివేత చర్యలు పార్టీ క్యాడర్‌నే కాకుండా పార్టీ నాయకత్వాన్ని, అలాగే పార్టీకి సహకరించే ప్రజలను కూడా నిర్మూలించడమేనని అధికార ప్రతినిధి జగన్ ఆందోళన వ్యక్తం చేసారు.ఈ భయంకరమైన దాడులు కొనసాగుతున్న తరుణంలో, కొంత మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, కింది స్థాయి కమిటీ సభ్యులు అనారోగ్య సమస్యల రీత్యా పార్టీ అనుమతితోనే సరెండర్ అయినట్టు జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. విప్లవ శిబిరంపై జరుగుతున్న యుద్ధ చర్యలను ఆపాలని దేశ వ్యాప్తంగా ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు, సంఘాలు, ప్రముఖులు విజ్ఞప్తులు చేశారు.ఆపరేషన్ ’కగార’ యుద్ధ కాండను నిలుపుదల చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామిక మేధావులు ‘పీస్ డైలాగ్ కమిటీ’గా ఏర్పడి, ప్రభుత్వానికి, మావోయిస్ట్ పార్టీకి మధ్య శాంతి చర్చలు జరగాలని ప్రతిపాదన చేశారు. దీనికి జవాబుగా కేంద్ర కమిటీ స్పందిస్తూ కూంబింగ్‌లు, హత్యకాండను ఆపాలని, కొత్త క్యాంపుల నిర్మాణం నిలు పుదల చేసి శాంతియుత వాతావరణంలోనే చర్చలు జరపాలని స్పష్టంగా ప్రకటించినట్టు జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌లను పట్టించుకోకుండా, ఎటువంటి సడలింపులూ లేకుండా యుద్ధ చర్యలను కొనసాగిస్తూ, ఆయుధాలు వదలిపెట్టి లొంగిపోవాలని పదే పదే ప్రకటిస్తుందని, ఇది అభయ్ చేసిన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటన అందుకు అనుగుణంగా ఉందని జగన్ ఆరోపిస్తున్నారు.ప్రస్తుత ప్రతికూల వాతావరణ క్రమంలో కేంద్ర కమిటీ సభ్యుడు సోనూ, సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని ప్రకటిస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను తాను ఇచ్చిన ఇమెయిల్ అడ్రస్‌కు పంపాలని కోరడం సరికాదని జగన్ అభ్యంతరం వ్యక్తం చేసారు. పార్టీ మౌలిక సిద్ధాంతమైన సాయుధ పోరాట విరమణ గురించి బహిరంగంగా ప్రకటించడం పార్టీ శ్రేణులలో తలెత్తిన గందరగోళాన్ని సృష్టించగా, దీని నుంచి బయట పడేందుకు మరో నేత జగన్ ప్రకటన చేశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా మావోయిస్టు పార్టీలో ఇద్దరు అగ్రనేతల పరస్పర విరుద్ద ప్రకటనల వల్ల ఆ పార్టీలో ముసలం పుట్టింది. ఈ పరిణామాలు ఆ పార్టీలో చీలికకు దారితీస్తుందా? లేక అంతర్గత విభేదాలను వీడి మళ్లీ ఏకం అవుతారా? అనేది తేలడానికి వేచి చూడాల్సిందే.

Also Read: శ్రీశైలం ఘాట్‌లో ఎలివేటర్ కారిడార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News