Sunday, May 5, 2024

టీమిండియాకు వైట్‌వాష్ ఖాయం: మార్క్‌వా జోస్యం

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు మిగిలిన మ్యాచుల్లో ఓటమి తప్పించు కోవడం అనుకున్నంత తేలికేం కాదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్‌వా అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌లో టీమిండియాకు వైట్‌వాస్ ఎదురు కావడం ఖాయమని జోస్యం చెప్పాడు. ఎదైన అద్భుతం జరిగితే తప్ప మిగిలిన మ్యాచుల్లో ఓటమిని తప్పించుకోవడం భారత్‌కు కష్టంతో కూడా విషయమేనని స్పష్టం చేశాడు. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లి సేవలు అందుబాటులో లేక పోవడంతో టీమిండియా బలహీనంగా మారిందన్నాడు. కోహ్లి ఉంటే పరిస్థితులు వేరే విధంగా ఉండేవన్నాడు. కోహ్లి లేని భారత జట్టుకు ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఎదుర్కొవడం చాలా కష్టమన్నాడు.

ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్‌లపై భారత బ్యాట్స్‌మెన్ తేలి పోవడం ఖాయమన్నాడు. కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్‌ల బౌలింగ్‌ను తట్టుకుని నిలబడడం భారత ఆటగాళ్లకు సాధ్యం అయ్యే పనికాదన్నాడు. ఇప్పటికే భారత బ్యాటింగ్ బలహీనత తొలి టెస్టులోనే బయటపడిందన్నాడు. పుజారా, కోహ్లి, రహానె తదితరులతో కూడా భారత్ 36 పరుగులకే కుప్పకూలడం తనను ఎంతో ఆందోళనకు గురిచేసిందన్నాడు. తొలి టెస్టులో ఎదురైన పరాజయంతో టీమిండియా ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిందన్నాడు. ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియాను ఓడించే విషయం అటుంచి కనీసం డ్రాతో గట్టెక్కినా అదే గొప్ప విషయమని మార్క్‌వా పేర్కొన్నాడు.

Mark Waugh sees no hope of India come back in 2nd Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News