Sunday, June 16, 2024

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర లోని థానే జిల్లా లోని కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం మధ్యాహ్నం సంభవించిన పేలుడులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 56 మంది గాయపడ్డారు. ముంబైకి 40 కిమీ దూరంలో థానే జిల్లా డొంబివిలి ఎంఐడిసి ( మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ) ఫేస్ 2 ఏరియాలో అముదాన్ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం మధ్యాహ్నం 1.40 ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఇంతవరకు నాలుగు మృతదేహాలను వెలికి తీయ గలిగారు. అవి గుర్తు పట్టలేనంతగా మాడి బొగ్గయ్యాయని కల్యాణ్ తహశీల్దార్ సచిన్ షెజాల్ చెప్పారు.

ఈ ప్రమాద ప్రభావం ఆ ప్రాంతంలోని ఐదు కంపెనీలపై పడింది. రాష్ట్ర పారిశ్రామిక మంత్రి ఉదయ్ సామంత్, స్థానిక ఎంపీ శ్రీకాంత్ షిండే, ఎమ్‌ఎల్‌ఎ రాజుపాటిల్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గాయపడిన వారికి వైద్యఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారని సామంత్ విలేఖరులకు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం వారం రోజుల్లో అందుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారని చెప్పారు. పేలుడు శబ్దం కిలోమీటర్ దూరం వరకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పరిసరాల్లోని భవనాల గాజు కిటికీలు పగుళ్లు ఇచ్చాయి. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News