Monday, May 6, 2024

10 వేల మంది కార్మికుల కుటుంబాలతో మేడే వేడుక

- Advertisement -
- Advertisement -

మే 1న హైదరాబాద్‌లో సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల (24 క్రాఫ్ట్)తో కలిసి మేడే ఉత్సవాలు నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి దొరై, కోశాధికారి సురేష్, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు ఫెడరేషన్‌కు సంబంధించిన సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజాగా ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన కొల్లి రామకృష్ణను శాలువాతో సన్మానించారు. ఇక కార్మిక దినోత్సవం బ్రోచర్‌ని కొల్లి రామకృష్ణ విడుదల చేయగా ఈవెంట్ టీ షర్ట్‌లను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ “సినిమా రంగంలోని 24 క్రాఫ్ట్ అంతా కలిసి మేడే ఉత్సవాలని జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, ఏపికి చెందిన పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పది వేలమంది కార్మికులు తమ కుటుంబాలతో కలిసి పాల్గొంటారు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News