Tuesday, May 21, 2024

అతడిని ఔట్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది: మయాంక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో అదరగొట్టడంతో బెంగళూరుపై లక్నో విజయం సాధించింది. మయాంక్ యాదవ్ మూడు కీలక వికెట్లు పడగొట్టి ఆర్‌సిబి నడ్డి విరిచాడు. లక్నో మొదటి బ్యాటింగ్ చేసి బెంగళూరు ముందు 181 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులు చేసి ఆలౌటైంది. మయాంక్ యాదవ్ నాలుగు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసి 14 పరుగులు ఇచ్చాడు. విజయంలో కీలక పాత్ర పోషించడంతో మ్యాన్ ఆఫ్ మ్యాచ్ దక్కింది. ఈ మ్యాచ్‌లో 156.7 కిలో మీటర్ల వేగంతో బంతి విసిరి నాలుగో బౌలర్‌గా అతడు రికార్డు సృష్టించాడు.

వరసగా రెండో సారి మయాంక్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మయాంక్ మాట్లాడారు. జాతీయ జట్టులోకి రావడమే తన లక్ష్యమని చెప్పారు. తన ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించానని, కామెరూన్ గ్రీన్ వికెట్ తీసినందుకు చాలా సంతోషంగా ఉన్నానని, వేగంగా బౌలింగ్ చేసేందుకు డైట్ తీసుకుంటున్నానని, నిద్ర, కఠోర శ్రమతో కూడిన శిక్షణ చాలా అవసరమని చెప్పారు. వేగంగా రికవరీ కావడానికి చన్నీటి స్నానంతో పాటు డైట్‌పై ఎక్కువ శ్రద్ధపెడుతానని వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News