Thursday, May 2, 2024

థీమ్ పార్క్‌ను ప్రారంభించిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి

- Advertisement -
- Advertisement -

Mayor Gadwal Vijayalakshmi inaugurates theme park

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం 92లోని థీమ్ పార్క్ మోనోలిత్ పార్క్‌ను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ స్థానిక ఎమ్యేల్యే దానం నగరేందర్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో 919 పార్క్‌లను 504 ట్రీ పార్క్‌లను అభివృద్ది చేస్తున్నామన్నారు.అంతే కాకుండారూ.137 కోట్ల వ్యయంతో 57 థీమ్ పార్క్‌లను డవలప్ చేస్తున్నామని త్వరలోని వీటిని నగరంలోని జోన్‌లలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. థీమ్ పార్క్‌లను తక్కవ సమయంలో అందుబాటులోకి తెచ్చిన అధికారులను అభినందించారు. బంజారాహిల్స్‌ల లోని లేక్ వ్యూ, గఫ్పార్ పార్క్ కాలనీలను పరిశీలించిన మేయర్ ఈ నెల 24న మంత్రి కేటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా పుట్టిన రోజు కానుకగా భారీ సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అన్ని డివిజన్‌లలో మొక్కలు లేని ప్రాంతాలను పరిశీలించి మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రగతిలో భాగంగా చివరి రోజు బంజారాహిల్స్, ఎల్‌బినగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో బస్తీవాసులకు మొక్కలను పంపిణీ చేశారు.పల్లేలు, పట్టణాలు తేడా లేకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచడంతో పాటు పెద్దపీట వేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ పట్టణ ప్రగతి కార్యకమాన్ని రూపొందించినట్లు చెప్పారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 10 రోజులు పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు మేయర్ వివరించారు. మొక్కలు నాటడం, చెత్తకుప్పలు లేకుండా చూడటం, రోడ్లపక్కన నిర్మాణ వ్యర్థాలను తొలగించడం, దోమల నిరవాణ, అటువంటి వ్యాధులు ప్రబలకుండా పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, కార్పోరేటర్ వెంకటేష్,జోనల్ కమిషషనర్ ప్రావీణ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News