Saturday, July 27, 2024

మైనర్ పై అత్యాచార కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష

- Advertisement -
- Advertisement -

rape

మన తెలంగాణ/హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆధారాలు సేకరించడం, నిందితులకు త్వరితగతిన శిక్షపడేలా చేసిన పోలీసులను సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ అభినందించారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ముగ్గురు నిందితులకు ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం రాయవరం గ్రామానికి చెందిన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. వెంకట్, ఆంజనేయులు, శ్రీరాములు అనే ముగ్గురు వ్యక్తులు గ్రామ శివారులో అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆ బాలిక చెవి కమ్మలు దొంగిలించుకుని వెళ్లారు. మరుసటి రోజు బాలిక తన తల్లిద్రండులతో కలిసి జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని నాలుగు రోజుల్లోనే అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్ని విచారించి కోర్టులో ప్రవేశపెట్టగా.. మెదక్ జిల్లా ఫస్ట్ అడిషినల్ జడ్జి పాపిరెడ్డి నేరస్తులకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు, ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల జరిమానా విధించారు.

Medak Court Orders Death Penalty to 3 men for Raping

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News