Monday, April 29, 2024

‘దిశ’ ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్ విచారణ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంది. కమిషన్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాశ్, సిబిఐ మాజీ డైరెక్టర్ కార్తికేయలు సభ్యులుగా ఉన్నారు. హైకోర్టు సి-బ్లాక్ వేదికగా కమిషన్ విచారణ కొనసాగించనుంది. ఈ కేసులో ఎన్‌కౌంటరయిన నిందితుల కుటుంబాలు విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై సిబిఐ లేదా ఇతర ఏజెన్సీలతో విచారణ జరిపించాలని కోరారు. అలాగే, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై న్యాయవాదులు జిఎస్ మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్ కూడా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు, నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారంటూ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీం త్రిసభ్య కమిషన్‌ను నియమిచింది.
ఇప్పటికే కేసు విచారణ ప్రారంభించిన కమిషన్ డైరీలు, ఇతర ఆధారాలను తెప్పించుకుని పరిశీలించింది. దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో జ్యూడిషియల్ కమిటీ దర్యాప్తును ముమ్మరం చేసింది. కమిషన్ సభ్యులను సిట్ అధికారి రాచకొండ సిపి మహేష్ భగవత్ కలిశారు. సైబరాబాద్ కమిషనరేట్ ఉన్నతాధికారులతో పాటు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, దర్యాప్తు అధికారులు, ఎన్‌కౌంటర్ అనంతరం పంచనామాలో భాగస్వాములైన రెవెన్యూ అధికారులు, పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులను న్యాయ విచారణ కమిషన్ ప్రశ్నించనుంది. దిశ నిందితుల కుటుంబసభ్యుల వాంగ్మూలాలను తీసుకోనుంది. హైకోర్టు వేదికగా కమిటీ దర్యాప్తు కనసాగుతున్న నేపథ్యంలో సీఆర్పీఎఫ్ బలగాలతో ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. దిశ కేసులో నలుగురు నిందితులు గతేడాది డిసెంబర్ 6న షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద జరిగిన పోలీసుల ఎదురు కాల్పుల్లో హతులైన సంగతి విదితమే.

Disha Encounter: Law Commission to Reach Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News