Wednesday, July 17, 2024

మేడారం జాతరకు 20 ప్రత్యేక రైళ్ళు

- Advertisement -
- Advertisement -

Medaram Jatara

 

హైదరాబాద్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు దక్షిణ మధ్య రైల్వే 20 జనసథన్ ప్రత్యేక రైళ్లు, పలు రైళ్ళకు అదనపు బోగీలను మంగళవారం నుండి ఈనెల 8వ తేదీ వరకు అందుబాటులోకి తెస్తున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుండి వరంగల్ రైల్వే స్టేషన్‌కు టికేట్ ధరను రూ.70గా ఖరారు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో జరిగే ఉత్సవాల్లో మేడారం జాతర ప్రధానమైంది. ఈ జాతరకు ఉభయ రాష్ట్రాలకు చెందిన ప్రజలే కాకుండా చుట్టు ప్రక్కల రాష్ట్రాల నుండి కూడా భారీగా భక్తులు వస్తుంటారు. మేడారం జాతర భక్తులు వరంగల్ రైల్వే స్టేషన్‌కు చేరుకునే విధంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల సందర్భంగా రద్దీ నివారణకు జిఎం.గజానన్ మాల్య ఆదేశాల మేరకు మేడారంకు ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీల సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో 10 ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్‌, వరంగల్‌, హైదరాబాద్, ఖాగజ్‌నగర్‌ వరంగల్‌ సిరిపూర్ ఖాగజ్‌నగర్‌ల మధ్య సాధారణ ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ళకు కూడా అదనపు బోగీలను ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్‌-వరంగల్‌-హైదరాబాద్‌ల మధ్య 10 ప్రత్యేక రైళ్లు మంగళవారం నుండి ఈ నెల8వ తేదీ వరకు నడుపుతారు. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి వరంగల్ రైల్వే స్టేషన్‌కు మధ్యాహ్నం 3:40 గంటలకు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో వరంగల్‌-హైదరాబాద్‌ల మధ్య ప్రత్యేక రైలు వరంగల్ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం 5:45 గంటలకు బయలుదేరి, హైదరాబాద్ రైల్వే స్టేషన్‌కు 9:40 గంటలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైలు మౌలాలీ, చర్లపల్లి, ఘట్ కేసర్, బీబీనగర్, భువనగిరి, వంగపల్లి, పెంబర్తి, జనగాం, రఘనాథ్‌పల్లి, ఘన్‌పూర్, పెండ్యాల్, ఖాజీపేట్‌ల మధ్య ప్రయాణిస్తాయని పేర్కొన్నారు.

సిరిపూర్ కాగజ్‌నగర్‌-వరంగల్ మధ్య 10 ప్రత్యేక రైలు
మేడారం జాతర సందర్భంగా సిరిపూర్ కాగజ్‌నగర్ వరంగల్ మధ్య 10 ప్రత్యేక రైలు మంగళవారం నుండి ఈనెల 8వ తేదీ వరకు నడుస్తాయని తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్ళు సిరిపూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి, వరంగల్ రైల్వే స్టేషన్‌కు 9:30 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 11 గంటలకు బయలుదేరి, సిరిపూర్ కాగజ్ నగర్ రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 3గంటలకు చేరుకుంటుందని తెలిపారు. ఈ ప్రత్యేక రైలు రాలంయపేట్, అసిఫాబాద్, రేపల్లివాడ, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రనాయక్, మంచిర్యాల, పెద్దంపేట్, రామగుండం, పెద్దపల్లి ఓడేలా, షరీఫ్, జమ్మికుంట, హసన్‌పర్తి రోడ్, ఖాజీపేట్ టౌన్ మార్గాలల్లో ప్రయాణిస్తాయి.

ఈ రైళ్ళకు అదనపు బోగీలు:
హైదరాబాద్‌-సిరిపూర్ కాగజ్ నగర్ ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్, కాగజ్‌నగర్‌హైదరాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌ఖాజీపేట్ ప్యాసింజర్, సికింద్రాబాద్‌వరంగల్ ప్యాసింజర్, వరంగల్‌హైదరాబాద్ ప్యాసింజర్ రైళ్ళకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తామన్నారు.

20 special trains for Medaram Jatara
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News