Tuesday, April 30, 2024

సమాజపు మార్పులో మీడియాది కీలక పాత్ర

- Advertisement -
- Advertisement -
  • మీడియా వార్తలతో ప్రజల్లో చైతన్యం
  • ప్రతిఒక్కరూ చట్టలపై అవగాహన కలిగి ఉండాలి: న్యాయమూత్రి కె. అనిత

నర్సాపూర్: మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, రిపోర్టర్స్‌కు, ఏర్పాటు చేసిన సమావేశంలో, సమాజపు మార్పులో మీడియా పాత్ర ఎంతో కీలకమని,నాయమూర్తి కె.అనిత అన్నారు. శనివారం నర్సాపూర్ లో న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో, వివిధ చట్టాల పైన అవగాహన కల్పిస్తూ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు అన్యాయాలను, సమస్యలను, ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉంటూ, సమస్యల పరిష్కారం కోసం న్యాయ విజ్ఞాన పరమైనటువంటి విషయాలను, గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేయడంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, పాత్ర ఎంతో కీలకమని అన్నారు.

మండల్ లీగల్ సర్వీస్ కమిటీ న్యాయస్థానం ద్వారా, గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాల పైన అవగాహన కల్పించే విషయంలో, ప్రజలందరికీ న్యాయవిజ్ఞానాన్ని పత్రికల ద్వారా, టీవీ చానల్స్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్న రిపోర్టర్స్‌ను అభినందిస్తున్నానని న్యాయమూర్తి కె. అనిత అన్నారు.అదేవిదంగా గ్రామాలలో ఇరువర్గాలు భూ తగాదాలుపడి పి. ఎల్. సి కేసుల్లో లీగల్ సర్వీస్‌కి విచ్చేసినటువంటి వారికి భూ చట్టాల పైన అవగాహన కల్పిస్తూ ఇరువర్గాలు కలిసిమెలిసి సమస్య పరిష్కారం చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ ఆంజనేయులు తాసిల్దార్ నర్సాపూర్, రవికుమార్ తహశీల్దార్ శివంపేట్, హేమ భార్గవి, సిడిపిఓ ఐసిడిఎస్, శివకుమార్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్సాపూర్, శివ ప్రసాద్ రెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కౌడిపల్లి,స్వరూపరాణి లీగల్ సర్వీస్ న్యాయవాది,జంగా శ్రీనివాస్ (కోర్టు సూపరింటెండెంట్) లీగల్ సర్వీస్ సిబ్బంది, కోర్టు పోలీస్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News