Saturday, May 11, 2024

షాబాద్ ప్రీబిడ్ మీటింగ్ విజయవంతం

- Advertisement -
- Advertisement -
ఔత్సాహికులు వందమంది హాజరు
తొలిదశలో 50 ప్లాట్లను వేలం పెట్టిన హెచ్‌ఎండిఏ

హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని షాబాద్ రెవెన్యూ గ్రామంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండిఏ) శనివారం నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశం విజయవంతం అయ్యింది. షాబాద్ ప్రాంతంలో 100 ఎకరాల విస్తీర్ణంలోని రెసిడెన్షియల్ జోన్‌లో హెచ్‌ఎండిఏ 877 ప్లాట్లతో లే ఔట్‌ను చేస్త్తోంది. శనివారం హెచ్‌ఎండిఏ షాబాద్ వెంచర్ స్థలంలో నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్‌కు ఔత్సాహికులు వంద మంది హాజరుకాగా వారి సందేహాలను హెచ్‌ఎండిఏ అధికారులు నివృత్తి చేశారు. షాబాద్ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హెచ్‌ఎండిఏ వెంచర్ అటు షాద్‌నగర్‌కు, శంషాబాద్‌కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారు.
మొత్తం 877 ప్లాట్లు
షాబాద్‌లో ఒక్కో ప్లాట్ 300 గజాల చొప్పున 877 ప్లాట్‌లతో వెంచర్‌ను హెచ్‌ఎండిఏ రూపొందిస్తోంది. వాటిలో తొలిదశలో 50 ప్లాట్‌లను హెచ్‌ఎండిఏ ఆన్ లైన్ వేలం ప్రక్రియ ద్వారా విక్రయించనుంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్లాట్ల ధరలను గజం రూ.10,000ల చొప్పున కనీస ధరగా హెచ్‌ఎండిఏ ఖరారు చేసింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఆన్‌లైన్ వేలం ప్రక్రియలో పాల్గొని గజానికి రూ.500ల చొప్పున కోట్ చేసి ఏ1 బిడ్డర్ నిలిచి ప్లాట్లను సొంతం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
పవర్ పాయింట్ ప్రజేంటేషన్ చేసిన ఎంఎస్‌టిస్ ప్రతినిధులు
శనివారం జరిగిన ప్రీబిడ్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టిసి ప్రతినిధులు తమ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా సాంకేతిక అంశాలను వివరించారు. హెచ్‌ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ (ఈఓ) బి.కిషన్‌రావు, హెచ్‌ఎండిఏ సెక్రటరీ పి.చంద్రయ్య, చీఫ్ జనరల్ మేనేజర్ మాజీద్ షరీఫ్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సిపిఓ) రవీందర్ రెడ్డి, చేవెళ్ల ఆర్డీఓ సాయిరాం, షాబాద్ తహసీల్దార్ సైదులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్, ఈఎంయూ డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News