Thursday, May 2, 2024

కరోనా టీకా వందశాతం పంపిణీకి వైద్యశాఖ కసరత్తు

- Advertisement -
- Advertisement -

ఈనెల 20 నుంచి వచ్చే నెల 3వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహణ
నోడల్ అధికారుల పర్యవేక్షణలో ఐదుగురు వైద్య సిబ్బంది ప్రచారం
సెకండ్ డోసు తీసుకోని వారంతా వెంటనే తీసుకోవాలని వైద్యశాఖ సూచనలు

Medical exercise for 100% distribution of corona vaccine
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో కరోనా వైరస్ నివారణ కోసం ప్రభుత్వం రెండు విడుతల్లో వ్యాక్సిన్ నేషన్ పంపిణీ చేసింది. మొదటి డోసు పూర్తి స్దాయిలో తీసుకోగా, సెకండ్ డోసు విషయంలో ప్రజలు నిర్లక్షం చేస్తుండటంతో వందశాతం టీకా తీసుకునేందుకు వైద్యశాఖ చర్యలు చేపట్టింది. గత పక్షం రోజుల నుంచి ఆరోగ్య కేంద్రాల్లో సరిపడ్డ వ్యాక్సిన్ నిల్వలు ఉంచిన ఆశించిన స్దాయిలో జనం రావడంలేదని, థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొవాలంటే టీకా తప్పనిసరిని వైద్యులు భావిస్తూ ఈనెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు వైద్య బృందాలు ఇంటింటికి తిరిగి టీకా తీసుకోనివారు తీసుకునేలా అవగాహన చేయనున్నారు. వార్డు, నోడల్ అధికారుల పర్యవేక్షణలో కాలనీకి ఐదుగురు సిబ్బంది ఆశావర్కర్, ఎఎన్‌ఎం, రిసోర్స్‌పర్సన్, ఎస్‌జే, ఎస్‌ఎఫ్‌ఏలు ఈ డ్రైవ్‌లో పాల్గొంటారు.

టీకా వేసే ఒక రోజు ముందు ఆయా కాలనీల్లో సర్వే నిర్వహించి మొదటి డోసు పూర్తియిన వారికి రెండో డోసు వేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వైరస్ నివారణే లక్షంగా రెండు దఫాలుగా వ్యాక్సిన్ పూర్తి చేస్తామని, ఇంకా మిగిలిన వారితో పాటు రెండో డోసు కూడా ఈవిడుతల్లో ప్రజలకు వేస్తామని జిల్లా వైద్యాదికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు ప్రజలు సహకరించాలని, వ్యాక్సిన్ తీసుకోని వారితో పాటు రెండో డోసు తీసుకునే వారు తమ ఇంటిలో ఉండాలని సూచిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటివరకు మొదటి డోసు 1,14, 93,410 మంది తీసుకోగా, సెకండ్ డోసు హైదరాబాద్ జిల్లాలో 18, 06, 205 మంది, రంగారెడ్డి జిల్లాలో 13, 59, 410 మంది, మేడ్చల్ జిల్లాలో 14, 36, 640మంది తీసుకున్నట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యాక్సిన్స్ వందశాతం పూర్తి చేసేందుకు 20 లక్షల డోసులు సిద్దంగా ఉన్నట్లు వాటి ద్వారా 40 లక్షలమందికి టీకా పంపిణీ చేస్తామని వైద్యులు చెబుతున్నారు.

నగరంలో రోజుకు 1.50లక్షల మందికి టీకా వేసేలా సిబ్బందిని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇటీవల ఆరోగ్య కార్యకర్తలు కొన్ని ఏరియాలో పర్యటించి టీకా తీసుకోవాలని కోరితే వైరస్ ప్రభావం అంతగాలేదని, తరువాత తీసుకుంటామని నిర్లక్షం చేస్తున్నారని వారందరు తీసుకునేలా స్దానిక రాజకీయ నాయకుల సహకారంతో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని వైద్యాధికారులు అంటున్నారు. చలి తీవత్ర పెరగడంతో వైరస్ విజృంభించే చాన్స్ ఉందని, ప్రజలు చలికాలం ముగిసే వరకు జాగ్రత్తలు పాటించాలని, ఒకవేళ వైరస్ సోకిన టీకా తీసుకుంటే తట్టుకునే సామర్దం ఉంటుందని, ప్రతి ఒకరు టీకా తీసుకోవడంతో పాటు, కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News