Friday, May 3, 2024

విశ్వశాంతిని ఆకాంక్షించడమే భారతీయ సంస్కృతి

- Advertisement -
- Advertisement -

Ramnath Kovind

 

హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతివనం
ధ్యాన కేంద్రం నుంచి రామ్‌నాథ్‌కోవింద్

రామచంద్రమిషన్ 75వ వసంతోత్సవంలో వేలాది మంది అభ్యాసీలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరు కోవడం మన సంస్కృతి అని, పరమార్థం, పరోపకారం మన దేశ అంతర్గత వారధులని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ పేర్కొన్నారు. రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చేగూరు వద్ద నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ కోవింద్ ఆదివారం నాడిక్కడ ప్రారంభించారు. వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు అనే విశ్వ మానవ సిద్ధాంతాన్ని అందించిన భారతీయ తత్వాన్ని ప్రపంచo లో వ్యాప్తి చేసేందుకు శ్రీరామ చంద్ర మిషన్ చేస్తున్న కృషి ఎనలేనిదని ప్రశంసించారు. దాదాపు 150 దేశాలలో ధ్యానం ద్వారా మానవ జీవితాల్లో పరివర్తన తెస్తున్న రామ చంద్ర మిషన్ తో తనకు మూడు దశాబ్దాలుగా అనుబంధం ఉందని కోవింద్ గుర్తు చేశారు.

ధ్యాన మార్గం ద్వారానే వ్యక్తిగత పరివర్తన తద్వారా సమాజ పరివర్తన సాధ్యమవుతుందని రాష్ట్రపతి అన్నారు. ఆందోళనకర పరిస్థితులు,అనిశ్చితి, అభద్రతాభావo శత్రుత్వ స్వభావం తో కూడిన ప్రస్తుత ప్రపంచంలో శ్రీ రామ్ చంద్ర మిషన్ వంటి సంస్థల బాధ్యత మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు. బాధాతత్ప సమాజానికి ఉపశమన సేవలను రామ చంద్ర మిషన్ లాంటి సంస్థలు మాత్రమే ఇవ్వడం లో కీలకపాత్ర వహిస్తాయని పేర్కొన్నారు మానవ సమాజాన్ని సరైన దిశలో నడిపించడానికి యువతను పెద్దఎత్తున భాగస్వా మ్యం చేస్తూ మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేoదుకు నిమగ్నం కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. శ్రీ రామ్ చంద్ర మిషన్ యొక్క విశ్వ సమాజం రుజు మార్గంతో కూడిన శక్తి, ఆనందమయం తో నిండిన ఈ ప్రపంచాన్ని మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

శ్రీరామచంద్ర మిషన్ 75వ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఆధ్యాత్మిక ప్రపంచంలో దాదాజీ సేవలు ఎంతో గొప్పవని ఆయన అన్నారు. ఆధ్యాత్మికత ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప బహుమతి అని, కన్హా శాంతివనంలోని లక్ష మొక్కలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయని, ఇదొక పవిత్ర స్థలం అనే భావన కలిగిస్తోందని చెప్పారు. సంస్థ ప్రథమగురువైన శ్రీరామచంద్ర(దాదాజీ) 147వ జన్మదినోత్సవాల నేపథ్యంలో కన్హా శాంతివనంలో ౩౦ ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ధ్యానకేంద్రాన్ని ఆయన హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ గ్లోబల్ హెడ్ క్వార్టర్‌గా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న కన్హా ఆశ్రమానికి సంబంధించి ఐదు వేలకు పైగా ధ్యానకేంద్రాలు ఉండగా.. వీటిలో అన్నింటికంటే మిన్నగా నిర్మించిన కన్హా శాంతివనాన్ని గ్లోబల్ హెడ్ క్వార్టర్‌గా రాష్ట్రపతి ప్రకటన చేశారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యానమందిరంగా పేరొందిన దీనిలో ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసుకునేలా ఏర్పాటు చేశారు. రామచంద్ర మిషన్ అధ్యక్షులు దాజి కమలేష్ పటేల్ మాట్లాడుతూ, పటిష్టమైన ఆధ్యాత్మిక భావన ద్వారా ప్రపంచానికి భారతదేశం మార్గదర్శకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, బండారు దత్తాత్రేయను రామచంద్రమిషన్ చైర్మన్ దాజీ కమలేష్ పటేల్ ఘనంగా సన్మానించారు. సుమారు రెండు గంటల పాటు రాష్టపతి కన్హా శాంతివనంలో గడిపారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్, మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు.

Meditation hall opened by Ramnath Kovind
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News