Sunday, May 5, 2024

కెటిఆర్‌కు హార్వర్డ్ వర్శిటీ ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

Minister KTR

 

హైదరాబాద్ : రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కె .తారకరామారావుకు మరోసారి ప్రముఖ అంతర్జాతీయ ఆహ్వానం అందింది. ఈసారి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. అఁదులో హార్వర్డ్ యూనివర్సిటీ ఇండియా కాన్ఫరెన్స్ -2020కి హాజరుకావాల్సిందిగా మంత్రి కెటిఆర్‌ను కోరింది. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఈ నెల 15 ,16 తేదీల్లో రెండు రోజుల పాటు ఇండియా కాన్ఫరెన్స్ ని నిర్వహిస్తోంది. ‘20/20 foresight‘ ఆనే థీమ్ తో యూనివర్సిటీ నిర్వహిస్తున్న 17వ ఇండియా కాన్ఫరెన్స్ కోసం పలువురు కీలక వ్యక్తులను ఆహ్వానించింది.

ఈ సమావేశంలో ‘భారతదేశంలో స్మార్ట్ సిటీలు‘ అనే అంశం పైన మాట్లాడాల్సిందిగా మంత్రి కెటిఆర్‌ను ఇండియా కాన్ఫరెన్స్ నిర్వాహకులు కోరారు . ఒకవైపు ఐటి శాఖతో పాటు మరోవైపు పురపాలక శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న మంత్రి కెటిఆర్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలతో పట్టణాల అభివృద్ధి వంటి అంశాల సమ్మిళితం అయిన స్మార్ట్ సిటీ అంశంపైన ప్రసంగించడం ముదావహంగా ఉంటుందని పేర్కొంది. భారతదేశ అంశాలపైన అమెరికాలో నిర్వహించే అతిపెద్ద సదస్సు ఈ హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్.

హార్వర్డ్ యూనివర్సిటీ మరియు హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి భారత్-అమెరికాల నుంచి పలు రంగాల్లోని ప్రముఖులు హాజరుకానున్నారు. ఇరు దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ఈ కాన్ఫరెన్స్‌కు రానున్నారు. ముఖ్యంగా అమెరికాలోని యంగ్ ప్రొఫెషనల్స్, ఇండస్ట్రీ లీడర్లు, అమెరికాలో వివిధ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ అమెరికన్లు, విద్యార్థులు, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఈ కాన్ఫరెన్స్‌కి హాజరై కీలకమైన అంశాలపై ఆయన విస్తృతంగా చర్చిస్తారు. మంత్రి కెటిఆర్‌తో పాటు ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యన్, అరుణ్ పూరి, సురేష్ ప్రభు, జయంత్ సిన్హా , అనుపమ్ ఖేర్, రితేష్ అగర్వాల్ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా ఈ కాన్ఫరెన్స్‌కి ఆహ్వానించింది.

Harvard University invitation to KTR
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News