Wednesday, May 8, 2024

సింగరేణి భవన్‌లో మెగా మెడికల్ క్యాంప్

- Advertisement -
- Advertisement -
వైద్య సేవల్లో సింగరేణి దే అగ్రస్థానం : డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్

హైదరాబాద్ : ఉద్యోగులు ఆరోగ్యవంతులుగా ఉంటే సంస్థ కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని గనులు కార్యాలయాల్లో కూడా ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని సింగరేణి సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ ఎన్ .బలరామ్ అన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ మెగా వైద్య శిబిరాన్ని ఆయన జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం.సురేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ .బలరామ్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ కోట్ల రూపాయలు వెచ్చించి వైద్య విభాగాన్ని ఆధునీకరించిందని, అలాగే దాదాపు 120 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా ప్రత్యేక సేవలు అందిస్తుందన్నారు. ఇంతేకాక గనుల వద్ద , కార్యాలయాల్లో కూడా ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, కాబట్టి దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేష్ మాట్లాడుతూ.. కంపెనీలో పనిచేసే ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుందని.. అందుకే ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం కోసం సంస్థ అనేక ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోందన్నారు. పని ఒత్తిడి, కుటుంబ పరమైన బాధ్యతల్లో పడి చాలామంది అనారోగ్యాల పాలవుతున్నారని, వారి సౌకర్యార్థం ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలకోటయ్య మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రులు మెగా వైద్య శిబిరంలో పాలుపంచుకున్నాయని పేర్కొన్నారు.

ఈ మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరంలో వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల వైద్య నిపుణులు ప్రత్యేక సేవలు అందించారు. ఈ మెగా వైద్య శిబిరంలో హైదరాబాద్‌కు చెందిన మెడికవర్, వెల్నెస్, సౌజన్య డెంటల్, విన్ విజన్, వాసవీ ఈ అండ్ టీ, బీబీ క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు సహాయ సిబ్బంది వైద్య సేవలు అందించారు. జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్టు, న్యూరో ఫిజిషియన్, ఆర్థో సర్థన్, గైనకాలజిస్ట్, డర్మటాలజిస్ట్, డెంటల్ సర్జన్, అఫ్తమాలజీ, ఈ అండ్ టీ సర్జన్, ఆడియాలజీ, ఆంకాలజీ నిపుణులు పరీక్షలు నిర్వహించారు. సింగరేణి భవన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు దాదాపు 500 మందికి పైగా వైద్య సేవలు పొందారు. ఈ క్యాంపు నిర్వహణ పట్ల హైదరాబాద్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది యాజమాన్యానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News