Sunday, September 21, 2025

‘ఒ’ బదులు ‘బి’ బ్లడ్ గ్రూపు ఎక్కించారు… ఎంజిఎం వైద్యుల నిర్వాకం

- Advertisement -
- Advertisement -

హనుమకొండ: వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఒక గ్రూపు బ్లడ్‌కు బదులుగా మరో గ్రూపు బ్లడ్ ను వైద్యులు ఎక్కించారు. ఫిమేల్ మెడికల్ వార్డులో జ్యోతి అనే రోగికి ఒ పాజిటివ్ బ్లడ్‌కు బదులుగా బి పాజిటివ్ బ్లడ్ ను వైద్యులు ఎక్కించారు. దీంతో ఆమె అస్వస్థతకు గురికావడంతో గుట్టు చప్పుడు కాకుండా ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాజీపేట మండలం అయోద్యాపురానికి చెందిన జ్యోతి తీవ్ర జ్వరంతో ఎంజిఎం ఆస్పత్రిలో చేరారు. జ్యోతికి రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించాలని వైద్యులు నర్సులకు సూచించారు.

Also Read: మహిళాశక్తికి వందనం

రక్త పరీక్షలు చేసిన అనంతరం బి పాజిటివ్ అని నిర్ధారించారు. రక్తం ఎక్కించేటప్పుడు రోగి తన బ్లడ్ గ్రూపు ఒ పాజిటివ్ అని చెప్పింది. వారు పట్టించుకోకపోవడంతో బి పాజిటివ్ బ్లడ్ ను ఆమెకు ఎక్కియడంతో ప్రాణపాయ స్థితికి చేరుకుంది. రక్తం మారడంతో వాంతులు, విరోచనాలు, ఒంటిపై దద్దుర్లు వచ్చాయని చెప్పారు. వెంటనే ఐసియులో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు.  ఎంజిఎం సూపరింటెండెంట్‌ను ప్రశ్నించగా హార్మోన్ ఇన్ బ్యాలెన్స్, ఇతర కారణాలతో కూడా రక్తం మార్పు చెందే అవకాశం ఉందని చెప్పడంతో పాటు తాము తప్పు చేయలేదని బుకాయించి అక్కడి నుంచి జారుకున్నాడు. అటెండర్ల నుంచి వైద్యుల వరకు అడుగడుగున నిర్లక్ష్యం కనిపిస్తుందని రోగులు వాపోతున్నారు. ఎదైనా అడిగేతే చాలు కసురుకుంటున్నారని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎంజిఎం సిబ్బంది నుంచి తమకు సహాయ సహకారాలు అందుబాటులో ఉండడంలేదని రోగులు మండిపడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News