Friday, April 26, 2024

ముంబై ముందుకు లక్నో ఇంటికి

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్ సీజన్16లో ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో జయకేతనం ఎగుర వేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 81 పరుగుల భారీ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో ముంబై క్వాలిఫయర్2కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగే ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ముంబై తలపడనుంది. ఇందులో గెలిచే జట్టు ఫైనల్‌కు దూసుకెళుతోంది. ఫైనల్ ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.

ఇక లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆకాశ్ మధ్వాల్ అద్భుత బౌలింగ్‌తో ముంబైని గెలిపించాడు. 3.3 ఓవర్లలో 5 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆకాశ్ ఏకంగా ఐదు వికెట్లను పడగొట్టాడు. దీంతో లక్నో ఇన్నింగ్స్ 101 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మేయర్స్ (18), మార్కస్ స్టోయినిస్ (40), దీపక్ హుడా (15) మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇన్నింగ్స్‌లో గ్రీన్ (41), సూర్యకుమార్ (33), తిలక్ వర్మ (26) మాత్రమే రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News