Tuesday, May 7, 2024

‘మిలా‌ద్‌ ఉ‌న్‌ నబీ’ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మంత్రి హరీష్ రావు ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరిలో శాంతి, సౌహార్దాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. మహమ్మద్‌ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడుస్తూ ఆయన బోధనలను సార్థకం చేయాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News